రాజశేఖర్, అంజలి గడ్డం గ్యాంగ్ ప్రారంభం

డా.రాజశేఖర్ కథానాయకుడిగా గడ్డం గ్యాంగ్ చిత్రం పూజా కార్యక్రమాలు గురువారం హైదరాబాద్ లో జరిగాయి. తమిళంలో విజయవంతమైన సూదుకవ్వమ్ చిత్రానికి రీమేకిది. జర్నీ ఫేం శరవణన్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన పి.సంతోష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శివాణి శివాత్మిక మూవీస్ పతాకంపై జీవితా రాజశేఖర్ నిర్మిస్తున్నారు. 

పంజా ఫేం అంజలి లావానియా రాజశేఖర్ సరసన కథానాయికగా నటిస్తోంది. కామెడీ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ చిత్రం మే మొదటివారం నుండి సెట్స్ మీదకెళ్లబోతుంది. 

సీనియర్ నరేష్, సీత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి – డేమిల్ గ్జవియర్ ఎడ్వర్డ్స్, సంగీతం – అచ్చు, ఆర్ట్ – వెంకట్, ఎడిటర్ – రిచర్డ్ కెవిన్, నిర్మాత – శ్రీమతి జీవితా రాజశేఖర్