“రాజావారు రాణిగారు” టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్….

ఈ మధ్యకాలం లో సోషల్ మీడియా లో వినూత్న రీతిలో ట్రెండ్ అయిన పదం #RVRG . అసలు ఈ #RVRG అంటే ఏమిట్రా బాబూ అంటూ తెగ ఆలోచించేసిన యూత్ సస్పెన్స్ కి తెర దించుతూ ఈ మధ్యనే ఎస్ ఎల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ #RVRG అంటే “రాజావారు రాణిగారు” అంటూ టైటిల్ పోస్టర్ ను అలాగే ఒక మోషన్ వీడియో ను రిలీజ్ చేశారు.ఈ టైటిల్ , మోషన్ వీడియో లో ఉన్న నేపథ్య సంగీతం ఇప్పటికే జనాన్ని తెగ ఆకట్టుకుంది. కాగా ఇప్పుడు ఈ చిత్రం టీజర్ విడుదలైంది. ఈ టీజర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. చూసిన ప్రతీ ఒక్కరు ఈ టీజర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రతీ ఒక్కరి జీవితంలోని సంఘటనలు ఈ టీజర్ చూసిన తర్వాత గుర్తుకు వస్తాయనిపించింది. ఈ చిత్రం ద్వారా కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ లు హీరో హీరోయిన్లు గా పరిచయం అవుతున్నారు. యువ నిర్మాత మనోవికాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తుండగా , జయ్ క్రిష్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ లాంచ్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ సందర్భంగా

చిత్ర నిర్మాత మనోవికాస్ మాట్లాడుతూ…. రాజా వారు రాణి గారు చిత్రం అందరికీ మంచి అనుభూతి ఇస్తుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్. డైరెక్టర్ రవి కిరణ్ చాలా కష్టపడ్డాడు. సెట్స్ లో అందరినీ మేనేజ్ చేశాడు. నరేషన్ ముందే ఇచ్చి సెట్స్ లో ఏ గోల లేకుండా చూసుకున్నాడు. కిరణ్ అన్నతో డిస్కస్ చేస్తున్నప్పుడు రాజావారు కథ విని ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నాం. హీరోయిన్ రహస్య సిస్టర్ లా సెట్స్ ని చిల్ చేసింది. ఫ్యామిలీ మెంబర్ లా కలిసిపోయింది. మా టెక్నీషియన్స్ ఈసినిమా కోసం చాలా కష్టపడ్డారు. టీజర్ మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అని అన్నారు.

హీరోయిన్ రహస్య మాట్లాడుతూ… ఆండ్రాయిడ్, ఐవోఎస్ కాలం నుంచి 1100 నాటి రోజుల్ని గుర్తుకు తెచ్చే సినిమా ఇది. రాజా వారు రాణి గారు మీ అందరినీ నోస్టాల్జిక్ రైడ్ ని ఫీల్ అయ్యేలా చేస్తుంది. టీజర్ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నా. అని అన్నారు.

డైరెక్టర్ రవి కిరణ్ మాట్లాడుతూ…. టీజర్ లో చెప్పినట్టు… కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్స్ తో తీర్చిదిద్దాం. చూసిన ప్రతీ ఒక్కరికీ ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది. సినిమా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది. అని అన్నారు.

హీరో కిరణ్ మాట్లాడుతూ… చాలా హ్యాపిగా ఉన్నాం. ఈ సినిమా పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. రాజా వారు రాణి గారు త్వరలో రిలీజ్ అవుతుంది. మీ నోస్టాల్జిక్ మూవ్ మెంట్స్ గుర్తు చేసుకొని నవ్వుకుంటారు. టీజర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే అందరికీ షేర్ చేయండి. సపోర్ట్ చేసిన అందరికీ చాలా చాలా థాంక్స్. అని అన్నారు.