రాజ్ దూత్ మూవీ రివ్యూ

సినిమా: రాజ్ దూత్
బ్యానర్: లక్ష్య ప్రొడక్షన్స్
నటీనటులు: మేఘాంశ్, నక్షత్ర, కోటా శ్రీనివాస్ రావ్, రవివర్మ తదితరులు
దర్శకులు: అర్జున్ , కార్తిక్
నిర్మాత: ఎం.ఎల్.వి.సత్యనారాయణ
కెమెరామెన్: విద్యాసాగర్ చింత
ఎడిటర్: విజయ్ వర్ధన్ కావూరి

శ్రీహరి చిన్నకొడుకు మేఘాంశ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం “రాజ్ దూత్”. అర్జున్, కార్తీక్ అనే ఇద్దరు దర్శకుల సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సత్తిబాబు నిర్మిస్తున్నారు. మేఘాంశ్ సరసన నక్షత్ర హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజ్ దూత్ ఎలా ఉందో ఈ రివ్యూ లో చూద్దాం.

కథ:

సంజయ్ (మేఘాంశ్) ప్రియ (నక్షత్ర) ను చూసి ప్రేమిస్తాడు. ఒక సందర్భంలో సంజయ్ ప్రియ తండ్రి దగ్గరికి వెళ్ళి తన కుమార్తెను వివాహం చేసుకుంటానని అడుగుతాడు. “నీకు ఏ అర్హత ఉంది నా కుమార్తెను” వివాహం చేసుకోవడానికి అని ప్రియ తండ్రి సంజయ్ ను ప్రశ్నిస్తాడు. సంజయ్ దగ్గర సమాధానం లేదు. ఆ సమయంలో ప్రియ తండ్రి సంజయ్ కు ఒక షరతు విధిస్తాడు. ఆ షరతులో నెగ్గితే తన కుమార్తెను ఇచ్చి పెళ్లి జరిపిస్తానని మాట ఇస్తాడు. ప్రియ తండ్రి సంజయ్ కు పెట్టిన షరతు ఏంటి? సంజయ్ చివరకు ఏం చేశాడు ? చివరకు సంజయ్, ప్రియ ఒక్కటి అయ్యారా ? తెలియాలంటే రాజ్ దూత్ చూడాల్సిందే.

విశ్లేషణ:

మొదటి సినిమాతో హీరో మేఘాంశ్ మంచి మార్కులు కొట్టేసాడు. అనుభవం కలిగిన నటుడిలా ప్రతిభను కనబరిచాడు. ఎమోషనల్ సీన్స్ లో మెప్పించాడు. హీరోయిన్ నక్షత్ర ప్రియ పాత్రలో చక్కగా నటించింది. సిటీకి చెందిన యువతి పాత్రలో నటించి మెప్పించింది. డైరెక్టర్స్ అర్జున్, కార్తిక్ ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉంది. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉండడంతో ఎక్కడా బోరింగ్ లేదు. వీరు రాసుకున్న డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి.

సినిమా విషయానికి వస్తే… సినిమా ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. హీరో రాజన్నాను ఒప్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఆ సన్నివేశాలు బాగున్నాయి. హీరో తన బాబాయ్ తో ఉన్న ఎమోషన్ సీన్స్ బాగున్నాయి. సినిమా సందర్భానికి తగ్గట్టు పాటలు వినసొంపుగా ఉన్నాయి. హీరో రెండు కుటుంబాలను కలిపేందుకు చేసే ప్రయత్రం బాగుంది. ఈ సన్నివేశాలకు ఆసక్తికరంగా ఉన్నాయి.

వినోదం , మంచి కథ కథనం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. మేఘాంశ్ నూతన నటుడైనప్పటికి అనుభవం కలిగిన హీరోలా నటించాడు. ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా రాజ్ దూత్. కొత్త దర్శకులు అర్జున్ కార్తిక్ మొదటి సినిమాతోనే సక్సెస్ సాధించారు. నిర్మాతకు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను రిచ్ గా చిత్రీకరించారు. వారికి ఈ సినిమా మంచి పేరు సంపాదించి పెడుతుంది. అన్నీ ఎమోషన్స్ ఉన్న బ్యూటీఫుల్ లవ్ స్టొరీ రాజ్ దూత్. అందరికి నచ్చే సినిమా అవుతుంది.

చివరిగా: ‘రాజ్ దూత్’ మిమ్మల్ని మెప్పిస్తుంది.

రేటింగ్: 3/5