రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగానే ఉన్నా…కానీ – రజనీకాంత్

రజనీకాంత్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తాడు. ఆయన వస్తే చూడాలని చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. రాజకీయాల గురించి ఎప్పుడు అడిగినా ముక్తసరిగా ఏదో ఒకటి చెప్పే రజనీ ఈసారి కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు. అవసరమైతే రాజకీయాల్లోకి వస్తానంటూ సెన్సేషనల్ స్టేట్ మెంట్ ఇచ్చి చర్చకు దారితీశారు. 

రజనీకాంత్ నటించిన లింగ్ ఆడియో ఫంక్షన్ చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. ఎ.ఆర్.రెహమాన్ సంగీతమందించిన ఈ చిత్రానికి కే.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించారు. సొనాక్షి సన్హా, అనుష్క హీరోయిన్స్. ఈ ఆడియో వేడుకలోనే రజనీకాంత్ తన రాజకీయ రంగ్రప్రవేశం గురించి క్లియర్ గా మాట్లడారు.

ఆయన మాట్లాడుతూ… పరిస్థితులే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. నాకు రాజకీయాలంటే అస్సలు భయం లేదు. వాటి గురించి నాకు అవగాహన ఉంది. పాలిటిక్స్ లోతెంతో నాకు బాగా తెలుసు. రాజకీయాల్లో ఉండాలంటే ఎంత ధైర్యం కావాలో కూడా తెలుసు. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే చాలామందిని దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత ప్రజలకు నిజంగానే మంచి చేయగలమా అనే ప్రశ్న వల్లే కాస్త వెనకాడుతున్నాను. నిజంగానే దేవుడు ఆదేశిస్తే నేను రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగానే ఉన్నా. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. అని రజనీకాంత్ అన్నారు.

రజనీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. రజనీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేస్తారా అనే ప్రశ్నలు లెవనెత్తాయి. రజనీ చప్పినట్టు ఏమో…ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు.