చెన్నైలో ఓటేసిన సూపర్ స్టార్ రజనీకాంత్

ఆరో దశ సార్వత్రిక ఎన్నికల పోలీంగ్ జోరుగా కొనసాగుతోంది. ప్రముఖ సినీనటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పుదుచ్చేరి సహా 11 రాష్ట్రాల్లోని 117 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. తమిళనాడులోని 39 లోక్ సభ, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి లోని ఒక లోక్ సభ స్థానానికి ఇవాళ పోలింగ్ నిర్వహిస్తారు. అయితే పోలీంగ్ ప్రారంభమైన వెంటనే ఓటర్లు బారులు తీరారు. 

ఇటీవలే మోడి సూపర్ స్టార్ రజనీకాంత్ ని కలిసిన విషయం తెలిసిందే. మోడీకి మద్దతు తెలుపుతున్నట్టు రజనీకాంత్ ప్రకటించారు. దీంతో ఆయన అభిమానులు మోడీని సపోర్ట్ చేస్తూ ఓట్లేసి ఉంటారని విశ్లేషకులు చెబుతున్నారు.