కోహ్లీ ఐలవ్‌యూ…అనుష్క ప్రేమపై రాఖీసావంత్ బాంబ్

బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీసావంత్ ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లి-అనుష్కశర్మ లవ్‌పై పెద్ద బాంబ్ వేసింది. తాను విరాట్ కోహ్లిని ప్రేమిస్తున్నానంటూ బహిరంగంగా చెప్పింది.

ఓ పక్క కోహ్లి-బాలీవుడ్ నటీమణి అనుష్కశర్మ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఈ టైంలో రాఖీసావంత్ తాను కూడా కోహ్లీని ప్రేమిస్తున్నానంటూ చెప్పడంతో ఇప్పుడు అనుష్క రాఖీ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తుందంటూ పెద్ద చర్చ జరుగుతోంది.

ముంబైలో ఓ స్పా ప్రారంభోత్సవానికి హాజరైన ఆమె తాను విరాట్‌ను ఎంతో గాడంగా లవ్ చేస్తున్నానంటూ చెప్పింది. అనుష్క విరాట్‌ను ప్రేమిస్తున్నట్టు ఇప్పటి వరకు బహిరంగంగా చెప్పలేదని..కాని తాను బహిరంగంగా చెపుతున్నానని మరీ అనుష్కను రెచ్చగొట్టేలా మాట్లాడింది.