అప్పుడు పస్తులున్నా… ఇప్పుడు నిర్మాతనయ్యా – రక్షకభటుడు నిర్మాత గురురాజ్

రియల్ ఎస్టేట్ రంగంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ… ఇప్పుడు సుఖీభవ పేరుతో చేపట్టిన కన్ స్ట్రక్షన్స్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్నాను. గతంలో నేను ఆర్టిస్ట్ అవుదామనుకున్నాను. కృష్టా నగర్ లో చాలా రోజులు పస్తులున్నాను. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎంటర్ అయ్యాను. భూతల్లిని నమ్ముకున్న తర్వాత మంచి పేరు డబ్బులు వచ్చాయి. అందుకే మళ్లీ చిత్ర పరిశ్రమలోకి వచ్చి సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నాను అని అన్నారు రక్షక భటుడు చిత్ర నిర్మాత గురురాజ్. ఆయన బర్త్ డే రేపే (మంగళ వారం) ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….

రక్ష, జక్కన్న వంటి సక్సెస్ పుల్ చిత్రాన్ని అందించిన వంశీ కృష్ణ ఓ మంచి ఆహ్లాదకరమైన చిత్రాన్ని అందించారు. ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ‌గారు క‌థే హీరోగా ర‌క్ష‌క‌భ‌టుడు చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారు. కథే ఈ సినిమాకు ప్రాణం. ఏప్రిల్ 7న రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తవలేదు. దీంతో పాటు ఆంజనేయ స్వామి పాత్ర సినిమాలో చాలా కీలకం. సర్ ప్రైజింగ్ స్టార్ ఇందులో నటించాడు. దానికి సంబంధించిన గ్రాఫిక్స్ ఇంకా పూర్తవలేదు. ఆంజనేయ స్వామి పాత్రధారితో పాటు మరో స్టార్ కూడా ఇందులో ఉన్నారు. వారు ఎవరు అనేది సినిమా రిలీజ్ అయ్యాకే చూడాలి. అరకు లోయలోని ఓ పోలీస్ స్టేషన్లో జరిగే కామెడీ ఎంటర్ టైనర్ ఇది. దేవుడు ఓ దెయ్యాన్ని కాపాడుతాడు. ఆర్టిస్టులంతా అద్భుతంగా నటించారు. రిచాప‌నై, బ్ర‌హ్మానందం, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, బ్ర‌హ్మాజీ, సుప్రీత్‌(కాట్రాజు). అదుర్స్ ర‌ఘు, ధ‌న‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో రక్షక భటుడు చిత్ర బిజినెస్ కూడా చాలా బాగా జరుగుతుందని ఎంక్వైరీస్ ద్వారా చెప్పగలం. నా తర్వాత సినిమా ఓ స్టార్ హీరోతో ఉంటుంది. భవిష్యత్తులో కొత్త చిత్రాలు కూడా నిర్మిస్తాను. అని అన్నారు.