శీనువైట్ల‌ను ప‌ట్టించుకోని రామ్ చ‌ర‌ణ్..

అవును.. బ్రూస్ లీ సినిమా విష‌యంలో రామ్ చ‌ర‌ణ్ హ‌వానే న‌డిచింది. మిగిలిన విష‌యాల్లో ఎలా ఉన్నా.. ఒక్క విష‌యంలో మాత్రం తాను అనుకున్న‌ది సాధించాడు మెగా వార‌సుడు. అది కూడా సినిమాకు అత్యంత కీల‌క‌మైన చిరంజీవి విష‌యంలో. ఈ సినిమాలో మెగాస్టార్ గెస్ట్ రోల్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇక్క‌డే అస‌లు మెలిక ఉంది. బ్రూస్ లీలో చిరంజీవి చేయాల్సిన పాత్ర నిడివి 15 నిమిషాలు. ముందుగా అలానే డిజైన్ చేసుకున్నారు శీనువైట్ల అండ్ టీం. కానీ చివ‌రి నిమిషంలో 15 నిమిషాలు కాస్తా 3 నిమిషాలైంది.

ఇక్క‌డే చ‌ర‌ణ్ హ‌స్తం ఉంది. అస‌లు బ్రూస్ లీ లో ఓ ప్ర‌ముఖ హీరో గెస్ట్ రోల్ చేయాల్సింది. కానీ ఆయ‌న హ్యాండివ్వ‌డంతో సందిగ్ధంలో ప‌డిపోయింది బ్రూస్లీ యూనిట్. ఇలాంటి టైమ్ త‌న‌యుడి కోసం త‌ర‌లి వ‌చ్చాడు మెగాస్టార్ చిరంజీవి. 150వ సినిమాకు ముందు తండ్రి త‌న సినిమాలో అతిథి పాత్ర చేయ‌డానికి స‌సేమిరా అన్నాడు చర‌ణ్. కానీ చిరంజీవి ప‌ట్టుబ‌ట్టి కొడుకుని ఒప్పించాడు. అయితే ముందు అనుకున్న‌ట్లు 15 నిమిషాలు కాదు.. అలా మెరిసి మాయ‌వ‌య్యేట్లు ఉంటేనే తండ్రి అతిథిపాత్ర చేయాల‌ని కండీష‌న్ పెట్టాడు రామ్ చ‌ర‌ణ్.

అనుకున్న‌ట్లు గానే మెగాస్టార్ పాత్ర నిడివి త‌గ్గిపోయింది. దీంతో పాటు సినిమాలో చిరంజీవికి ఓ పాట‌ను కూడా ప్లాన్ చేసారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. దీనికి కూడా రామ్ చ‌ర‌ణ్ ఒప్పుకోలేదు. చిరు చిందేయ‌డానికి రామ్ చ‌ర‌ణ్ నో అన్నాడు. దీనికి కార‌ణం తండ్రి 150వ సినిమాకు తానే నిర్మాత కావ‌డం. అవును.. చిరంజీవి స్టెప్పులు చూడాలంటే రీ ఎంట్రీ వ‌ర‌కు ఆగాల్సిందే.. తండ్రి కాలంటూ క‌దిపితే అది రీ ఎంట్రీ మూవీలోనే అంటూ బ్రూస్లీ లో చిరంజీవి పాట‌ను తీయ‌నివ్వ‌లేదు చ‌ర‌ణ్. మొత్తానికి తండ్రి అతిథిపాత్ర‌ను ఓ ట్రైల‌ర్ లా చూపించ‌డానికి ఒప్పుకున్నాడు రామ్ చ‌ర‌ణ్. ఈ విష‌యంలో త‌న మాటే గెన్నించుకున్నాడు మెగా వార‌సుడు.