ప‌వ‌ర్ స్టార్‌ను పిల్లితో పోల్చిన వ‌ర్మ‌…సింహంలా ఉండాలని సెటైర్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్రెస్‌మీట్‌పై టీడీపీ నాయ‌కులు విమ‌ర్శ‌ల వ‌ర్షం ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే సోమ‌వారం ప్రెస్‌మీట్‌లో ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై వ‌ర్మ ట్వీట్ట‌ర్‌లో త‌న‌దైన శైలీలో స్పందించారు. ప‌వ‌న్ సింహం లాంటివాడ‌ని..అలాంటి సింహం ఆలోచిస్తే ఆ గ‌ర్జ‌న‌కు అర్థం లేద‌ని సూచించారు. అయితే ప‌వ‌న్ ప్ర‌సంగంలో ఉన్న చిక్క‌ల్లా గ‌ర్జించే సింహం మేక‌లా మాట్లాడ‌డం ఏంట‌ని వ‌ర్మ ప్ర‌శ్నించారు.

ఓటుకు నోటు కేసులో ప‌వ‌న్ ప్ర‌సంగాన్ని చూశాన‌ని… ప‌వ‌న్ పిల్లిలా ఉండ‌కూడ‌ద‌ని….ఆయ‌న నుంచి ఫ్యాన్స్ పులిగ‌ర్జ‌న‌లు కోరుకుంటున్నార‌ని వ‌ర్మ చెప్పాడు. మేక‌కి, మొక్క‌కి తేడా తెలియ‌ని సింహం సింహం కాద‌ని వ‌ర్మ చెప్పాడు. అలాగే కుక్క‌లు సింహం జూలో ఉంద‌నే భ్ర‌మ‌లో ఉన్నాయ‌ని…కుక్క‌లు తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయ‌ని ట్వీట్‌లో తెలిపాడు. సింహం త‌ల‌చుకుంటే ఎప్పుడైనా ఎటాక్ చేయ‌గ‌ల‌ద‌నే వాస్త‌వాన్ని కూడా కుక్క‌లు తెలుసుకోవాల‌ని…సింహం గ‌ర్జ‌న‌లో అర్థం వెత‌క‌డం…కుక్క‌ల మొరుగుల్లో లాజిక్ వెత‌క‌డం లాంటిద‌ని..ప‌వ‌న్ ఎప్పుడు బెస్ట్‌గానే ఉండాల‌ని తాను కోరుకుంటున్న‌ట్టు వ‌ర్మ తెలిపాడు.

ఏదేమైనా వ‌ర్మ ప్ర‌సంగంలో ప‌వ‌న్‌కు చుర‌క‌లు వేసిన‌ట్టే క‌నిపిస్తోంది. సింహం/ పులి లాంటి ప‌వ‌న్ పిల్లిలా మాట్లాడడం త‌గ‌ద‌న్న సూచ‌న వ‌ర్మ త‌న మాట‌ల్లో వ్య‌క్త‌ప‌రిచిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది. మ‌రి వ‌ర్మ సూచ‌న ప‌వ‌న్ ఎంత‌వ‌ర‌కు పాటిస్తాడో చూడాలి.