ఆ వ‌ర్మ‌కు ఇప్పుడైనా క‌లిసొస్తుందా..?

వ‌ర్మ అనే పేరు ఉన్న‌వాళ్లెవ్వ‌రికీ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో టైమ్ క‌లిసొస్తున్న‌ట్లు లేదు. అసలే రామ్ గోపాల్ వ‌ర్మ కు కొన్నాళ్లుగా స‌రైన విజ‌యం లేదు. ఇక ఇప్పుడు మ‌రో వ‌ర్మ హిట్ కోసం వేచి చూస్తున్నాడు. ఆయ‌నే ర‌మేష్ వ‌ర్మ. ఈ పేరు ఎప్పుడో ఎక్క‌డో విన్న‌ట్లుంది క‌దా..! అవును.. ఈయ‌న గ‌తంలో ర‌వితేజ హీరోగా వీర అనే సినిమా తీసాడు. ఇది డిజాస్ట‌ర్ గా నిలిచింది. అంత‌కుముందు ఒక ఊరిలో అనే క‌ళాఖండాన్ని కూడా తెర‌కెక్కించాడు. బ్రేక్ మాత్రం రాలేదు.

ఇన్నాళ్ల‌కు అబ్బాయితో అమ్మాయి అనే సినిమాతో వ‌చ్చేస్తున్నాడు ర‌మేష్ వ‌ర్మ‌. పోస్ట‌ర్లు, టీజ‌ర్లు చూస్తుంటే మాత్రం ఈ సారి కాస్త ఫ్రెష్ ల‌వ్ స్టోరీతో వ‌స్తున్న‌ట్లు క‌నిపిస్తున్నాడు ర‌మేష్ వ‌ర్మ‌. యంగ్ హీరో నాగ‌శౌర్య హీరోగా తెర‌కెక్కిన ఈ సినిమాకు ఇళ‌యారాజా సంగీతం అందించ‌డం విశేషం. న‌వంబ‌ర్ 18న ఆడియో విడుద‌ల కానుంది. సినిమా డిసెంబ‌ర్ లో విడుద‌ల కానుంది. మ‌రి ఈ సినిమాతోనైనా వ‌ర్మ‌గారి జాత‌కం మారుతుందో లేదో చూడాలి.