క్రికెటైటీస్ ప్రమాదకర వ్యాధి…భారత్ ఓటమి హ్యాపీ: టాప్ డైరెక్టర్ ట్వీట్

ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భారత జట్టు ఓడిపోయిందని క్రికెట్ ప్రేమికులు తెగ బాధపడిపోతున్నారు. అయితే సంచనల దర్శకుడు రాంగోపాల్‌వర్మ మాత్రం చాలా సంతోషంగా ఉన్నానంటూ ట్వీట్ చేశాడు. భారత్ ఓడిపోయినప్పటి నుంచి వర్మ ట్వీట్లు చేస్తూనే ఉన్నాడు.

క్రికెట్ కంటే కూడా తాను క్రికెట్ ప్రేమికులను బాగా ద్వేషిస్తానని వర్మ చెప్పాడు. తాను దేశాన్ని ప్రేమిస్తానని..అందుకే క్రికెట్‌ను ద్వేషిస్తానని చెప్పాడు. క్రికెటైటీస్ వల్ల దేశ ప్రజలు టీవీలు చూస్తూ నాన్ ప్రొడక్టివిటీగా మారి వాళ్లు పనిచేయడం మానేస్తారని వర్మ తెలిపాడు. 

క్రికెటైటీస్ నుంచి దేశాన్ని రక్షించాలని తాను దేవుళ్లందరిని కూడా ప్రార్థిస్తున్నట్టు వర్మ చెప్పాడు. మద్యపానం, ధూమపానం వల్ల జరిగే నష్టం కొంత మాత్రమే అయితే క్రికెట్‌కు బానిస కావడం అనేది జాతీయ వ్యాధి అని వర్మ చెప్పాడు.