రామోజీరావు…జగన్ ఒక్కటైన వేళ…

హీరో మంచు మనోజ్ వివాహ వేడుకలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఈనాడు అధినేత రామోజీరావు, వైకాపా అధినేత వైఎస్.జగన్ కరచాలనం చేసుకున్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి రామోజీరావు ముందుగానే చేరుకుని వివాహ వేడుకను వీక్షిస్తున్నారు. కాస్త ఆలస్యంగా అక్కడకు చేరుకున్న వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి రామోజీరావు కూర్చున్న సీటు వద్దకు వెళ్లి ఆయనకు చేయి ఇచ్చి కరచాలనం చేశారు.

వెంటనే రామోజీరావు కూడా లేచి జగన్‌కు చేయి ఇచ్చి ఆప్యాయంగా పలకరించారు. రామోజీ పక్క సీట్లోనే జగన్ కూర్చున్నారు. వీరిద్దరు ఇలా పక్కపక్కనే కూర్చుని, కరచాలనం చేసుకుని మాట్లాడుకోవడం ఈ వేడకలో కాస్త హైలెట్ అయ్యింది.