రానాతో డేటింగ్ లింక్‌పై రాగిణి కామెంట్.. త్రిషకు బైబైనా

టాలీవుడ్ నటుడు దగ్గుపాటి రానాతో తాను డేటింగ్ చేయట్లేదని ప్రముఖ కన్నడ నటి రాగిణిద్వివేది తెలిపారు. రానాతో తనకు లింకు ఉందని సిల్లీ కామెంట్లు చేయవద్దని ఆమె సోషల్‌సైట్లలో తన సందేశాన్ని పోస్ట్ చేసింది. రానాకు రాగిణికి లింకు ఉందని అందువల్లే త్రిషతో రానా బంధం చెడిపోయిందంటూ ఇటీవల పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. రానా అఫైర్ బ్రేక్ అవ్వడానికి తాను కారణం కాదని కూడా ఆమె ఓ ఆంగ్లదినపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు. ప్రస్తుతం తన వృత్తిపరమైన జీవితంతో తాను చాలా సంతోషంగా ఉన్నానని దయచేసి తనను ఇలాంటి వివాదాల్లోకి రావద్దని ఆమె తెలిపింది.