రణరంగం మూవీ రివ్యూ….

రణరంగం మూవీ రివ్యూ….

స్టయిలిష్ ఎమోషనల్ యాక్షన్ సినిమాలు తీయడం లో సుధీర్ వర్మ కు మంచి పేరుంది. అందుకే శర్వా తనను కొత్తగా చూపించుకునేందుకు విభిన్నమైన పాత్రలో కనిపించాడు. రెండు పాత్రల్ని ఇందులో శర్వా పోషించాడు. కాజల్ హీరోయిన్ కాకపోయినా ముఖ్య పాత్ర పోషించింది.
కళ్యాణి ప్రియదర్శి  హీరోయిన్. నేడు ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదల అయ్యింది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమా నిర్మించింది. ఈ చిత్రంలోని పాటలు, ట్రైలర్స్ ఆకట్టుకోవడంతో మూవీ పై అంచనాలు బాగానే ఉన్నాయి. మరి ఈ చిత్రం ఆ అంచనాలు ఎంత వరకు అందుకుందో సమీక్షలో చూద్దాం…

కథేంటంటే…
దేవా(శర్వానంద్) తన మిత్రులతో కలిసి బ్లాక్ టికెట్స్ అమ్ముతూ సాదా సీదాగా బ్రతికే సామాన్య కుర్రాడు. అలాంటి దేవా 1995 సంవత్సరంలో మధ్య పాన నిషేధంతో  బ్లాక్ మార్కెట్ దందా వల్ల బాగా సంపాదించే అవకాశం ఉండటంతో దేవా ఆ ఇల్లీగల్ బిజినెస్ లోకి దిగి అంచలంచెలుగా ఎదుగుతాడు. ఆలా ఓ సామాన్య కుర్రాడు అందరిని భయపెట్టే గ్యాంగ్ స్టర్ స్థాయికి ఎలా ఎదిగాడు? ఆలా ఎదిగే క్రమంలో దేవా ఎదుర్కొన్న సమస్యలు ఏమిటీ? దేవా ని మట్టుబెట్టాలని ఎదురుచూస్తున్న శత్రువుల నుండి ఎలా బయటపడ్డాడు? అనేది మిగతా కథాంశం.

సమీక్ష
రణరంగం మూవీ రెండు విభిన్న పీరియడ్ లో సాగే గ్యాంగ్ స్టర్ స్టోరీ. 90లనాటి యువకుడిగా, ప్రస్తుతం కాలంలో గ్యాంగ్ స్టర్ గా శర్వా నటన ఆకట్టుకుంటుంది. యాక్షన్ సన్నివేశాలతో పాటు భావోద్వేగ సన్నివేశాలలో శర్వా ఆకట్టుకుంటాడు. ఇంతకు ముందు శర్వా ఇలాంటి గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించక పోవడంతో ప్రేక్షకులకు ఓ కొత్త భావన కలుగుతుంది. ఇక ఈ కాజల్ డాక్టర్ పాత్రకు చక్కగా సరిపోయారనే చెప్పాలి. ముఖ్యంగా పతాక సన్నివేశాలలో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన బాగుంది.
ఇక మరో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శి 90ల కాలం నాటి ఆమ్మాయిగా ఆ పాత్రకు చక్కగా సరిపోయింది.ఓణీలలో ప్రతి సన్నివేశంలో ఆమె అమాయకత్వంతో కూడిన క్యూట్ నెస్ తో ఆకట్టుకుంటుంది.

దర్శకుడు సుధీర్ వర్మ తాను చెప్పాలనుకున్న విషయాన్నీ తెరపై ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యాడు. కథలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లడం కోసం తీసిన లవ్ స్టొరీ సీన్స్ ఆకట్టుకుంటాయి. బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. కొత్త రకమైన సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. గ్యాంగ్ స్టర్ గా శర్వాని ప్రెసెంట్ చేసిన తీరు బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. ప్రశాంత్ పిళ్ళై మ్యూజిక్ ఈ సినిమాకు బాగా ఉపయోగపడింది. ఇక దివాకర్ మణి కెమెరా వర్క్ తో అద్భుతమైన విజువల్స్ అందించాడు. ఈ  తరహా కెమెరా వర్క్ ఈ మధ్య కాలంలో రాలేదనే చెప్పాలి. సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది.
కెమెరా పనితనం సన్నివేశాలు తెరపై రిచ్ గా చూపించింది. ఎడిటింగ్ షార్ప్ గా ఉంది.  నిర్మాణాత్మక విలువలు రిచ్ గా ఉన్నాయి.

ఫైనల్ గా…
హీరో, హీరోయిన్ల నటన, మ్యూజిక్ హీరోను గ్యాంగ్ స్టర్ గా ప్రెసెంట్ చేసిన విధానం, సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. విభిన్నంగా సాగే కథ, స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు మంచి ఫస్ట్ లా ఉంటది. అన్ని వర్గాల్ని ఎంటర్టైన్ చేసే స్టైలిష్ సినిమా ఇది. కొత్త రకమైన అనుభూతి ఈ సినిమాతో కలుగుతుంది. సో గో అండ్ వాచ్….

PB Rating : 3.5/5