మనీషా ఫిలిమ్స్ నవ్వుల ‘రంగుపడుద్ది’ మూవీ రివ్యూ

మనీషా ఫిలిమ్స్ నవ్వుల ‘రంగుపడుద్ది’ మూవీ రివ్యూ

కిషోర్ రాఠి సమర్పణలో మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై అలీ మెయిన్ లీడ్ పోషించిన చిత్రం ‘రంగుపడుద్ది’. ధనరాజ్, సుమన్ శెట్టి, హీన, షేకింగ్ శేషు, జబర్దస్త్ అప్పారావుల తారాగణంతో రూపొందిన ఈ చిత్రానికి ఎస్. శ్యామ్ ప్రసాద్ దర్శకుడు కాగా.. మహేష్ రాఠి నిర్మాత. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

కథేంటంటే…..ధనరాజ్, సుమన్ శెట్టి, హీన స్నేహితులు
ఆలీ, షేకింగ్ శేషు, జబర్దస్త్ అప్పారావు ఫ్రెండ్స్. వీరంతా విభిన్నమైన కెరీర్ లో కొనసాగుతుంటారు. కానీ సంతృప్తిగా వుండరు. ఎదో ఓ మ్యాజిక్ జరిగి తాము అనుకున్నవి నెరవేర్చుకోవలనుకుంటారు. అదే సమయం లో బ్లాక్ హోల్ టైం ట్రావెల్ మీద రీసెర్చ్ చేస్తున్న రఘుబాబు పరిచాయమౌతారు. వీరంతా పాస్ట్ లోకి టైం ట్రావెల్ కవలనుకుంటారు. వీరందరినీ రాజమాహెల్ కు రమ్మంటాడు. అక్కడికి వెళ్ళాక దెయ్యాలు ఉన్నాయని భయపడుతారు. ఇంతకు రాజమహల్ లో దయ్యలున్నాయా. టైం ట్రావెల్ చేశారా. వీరంతా అక్కడినుంచి ఎలా బయటపడ్డారు. ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సమీక్ష….
అప్పట్లో మనీషా బ్యానర్ లో బ్లాక్ బస్టర్ అయిన ఘటోత్కచుడు చిత్రంలో ఫేమస్ అయిన రంగుపడుద్ది డైలాగ్ నే ఇప్పుడు టైటిల్ గా పెట్టి మళ్లీ ఇదే బ్యానర్ లో ఓ మంచి కామెడీ హారర్ ను తెరకెక్కించారు. రెండు గ్రూపులు ఒకే ఇంట్లోకి ప్రవేశించక జరిగే కామెడీ బాగా పండింది. దాన్నే ఔట్ అండ్ ఔట్ కామెడీ తో తెరకెక్కించారు దర్శకుడు శ్యామ్ ప్రసాద్ కథను డీల్ చేసిన విధానం బాగుంది. కామెడీ ని బాగా వర్కవుట్ చేయగలిగారు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. యమలీల చిత్రంలో చినుకు చినుకు పాటను మళ్లీ ఇప్పుడు అప్పారావు కు హీరోయిన్ కు మధ్య కంపోజ్ చేశారు. ఈ సినిమా ఎండ్ లో వచ్చే ప్రోమోషనల్ సాంగ్ బాగుంది. ఒక బంగ్లా లో ఇద్దరి గ్యాంగ్ మధ్య చోటు చేసుకునే ఘర్షణను దర్శకుడు తన దైన కామెడీతో మెప్పించాడు.  పూర్తి స్థాయి హారర్ కామెడీ తో తెరకెక్కిన ఈ చిత్రం అందర్నీ అలరిస్తుంది.

హీరోయిన్ హీన గ్లామర్ తో పాటు అభినయం తో మెప్పించింది. ఆలీ, రఘుబాబు, ధనరాజ్, జబర్దస్త్ అప్పారావు, సుమన్ శెట్టి, షేకింగ్ శేషు అనుభవం కామెడీ టైమింగ్ సినిమాకు బాగా ఉపయోగపడింది. మహేష్ రాఠి విభిన్నమైన కథ అందించారు. అభయ్ శ్రీ జయ్ డైలాగ్స్ బాగున్నాయి. మ్యూజిక్ సుభాష్ ఆనంద్, చాలా బాగా ఇచ్చాడు. డిఓపి: జి. ఎస్. రాజ్ తన కెమెరా వర్క్ తో మెప్పించాడు. నిర్మాణాత్మక విలువలు చాలా బాగున్నాయి.

ఫైనల్ గా
క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు చిన్న పిల్లల్ని సైతం ఈ రంగుపడుద్ది చిత్రం ఎంటర్టైన్ చేస్తుంది. ఈ సమ్మర్ వెకేషన్ కు కూల్ ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రం అవుతుంది

Rating : 3/5