`రంగుల క‌ల‌` ప్రారంభం

ఎల్‌.వి.మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం `రంగుల క‌ల‌` సోమ‌వారం హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోలో ప్రారంభ‌మైంది. వి.క్రాంతి కుమార్ ద‌ర్శ‌క నిర్మాత‌. తొలి స‌న్నివేశానికి రాజ్‌కుమార్‌.ఎం. క్లాప్ కొట్ట‌గా సిద్ధేశ్వ‌ర పీఠం స్వామి విశ్వ‌దానంద కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అనంత‌రం జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో..

రాజ్‌కుమార్‌.ఎం మాట్లాడుతూ – “క్రాంతి కుమార్ ద‌ర్శ‌క నిర్మాణంలో రూపొందుతోన్న రంగుల క‌ల‌. ర‌వీంద్ర తేజ‌, అక్ష‌ర ఈ సినిమాలో హీరో హీరోయిన్స్‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. యూనిట్‌కు సినిమా మంచి పేరు తేవాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.
స్వామి విశ్వ‌దానంద మ‌ట్లాడుతూ – “సినిమాలో న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్‌కు సినిమా మంచి పేరు తీసుకురావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

ద‌ర్శ‌క నిర్మాత వి.క్రాంతికుమార్ మాట్లాడుతూ – “ర‌వీంద్ర‌తేజ్‌, అక్ష‌ర‌తో పాటు కొత్త న‌టీన‌టులు, ప్యాడింగ్ ఆర్టిస్టులు న‌టిస్తున్నారు. ఇండ‌స్ట్రీలోని ప‌రిస్థితుల‌ను తెలియ‌జేసే సినిమా. వ‌రూధిని అనే హీరోయిన్‌ను ఓ ప‌ల్లెటూరులో రైతు కొడుకు ఇష్ట‌ప‌డ‌తాడు. త‌న అభిమాన హీరోయిన్‌ను చేరుకుని ఎలా ఆమెను సొంతం చేసుకున్నాడ‌నేదే క‌థ‌. జూన్‌, జూలైలో సినిమా హైద‌రాబాద్‌, అమ‌రావ‌తి, క‌ర్ణాట‌క‌ల్లో షూటింగ్ పూర్తి చేస్తాం. రాజ్‌కుమార్‌గారు త‌న వంతు స‌హ‌కారం అందిస్తాన‌ని తెలియ‌జేశారు“ అన్నారు.
హీరో ర‌వీంద్ర తేజ్ మాట్లాడుతూ – “స్క్రిప్ట్ విన‌గానే న‌చ్చింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఇండ‌స్ట్రీలోని ఎలా ఉంటుందో వాటిని ఈ సినిమాలో చూపిస్తున్నాం“ అన్నారు.

అక్ష‌ర మాట్లాడుతూ – “అవ‌కాశం ఇచ్చిన క్రాంతికుమార్‌గారికి థాంక్స్‌“ అన్నారు.