లంక కోసం ఐనా సాహో… రెచ్చిపోయింది…

సీనియర్ హీరోయిన్ రాశి కీలకపాత్రలో రోలింగ్ రాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నామన దినేష్-నామన విష్ణు కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ "లంక". శ్రీముని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నామన శంకర్రావు-సుందరిలు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు నామన దినేష్-నామన విష్ణు కుమార్ లు మాట్లాడుతూ.. "వైవిధ్యమైన కథాంశంతో సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా ఇది. టెలీపతి నేపధ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతినిస్తుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కు విశేషమైన స్పందన వచ్చింది. అలాగే ఈ చిత్రంలో మరో కథానాయికగా నటిస్తున్న ఐనా సాహాపై చిత్రీకరించిన పాట సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న "లంక" తప్పకుండా సూపర్ హిట్ అవుతుందన్నా నమ్మకం ఉంది" అన్నారు.

రాశి, సాయి రోనక్, ఐనా సాహ, సిజ్జు, సుప్రీత్, లీనా సిద్ధు, రాజేష్, సత్య, సుదర్శన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్: లెనిన్, డ్యాన్స్: స్వర్ణ, కళ: హరివర్మ, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, కెమెరా: వి.రవికుమార్, మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం.రవిబాబు, పి.ఆర్.ఓ: వంశీశేఖర్, నిర్మాతలు: నామన దినేష్-నామన విష్ణు కుమార్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీముని!