రాయలసీమ లవ్ స్టోరీ మూవీ రివ్యూ

రాయలసీమ లవ్ స్టోరీ మూవీ రివ్యూ

ఈ మధ్య కాలంలో రాయలసీమ లవ్ స్టోరీ చిత్రం గురించి బాగా ఎక్కువగా మాట్లాడుకున్నారు. సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో గందరగోళం నెలకొంది. ఐతే మంచి క్రేజ్ మధ్య ఈ సినిమా విడుదలైంది. A 1 ఎంటర్ టైన్ మెంట్స్ మూవీస్ బ్యానర్ పై వెంకట్  హీరోగా హృశాలి, పావని  హీరోయిన్స్ గా నటించిన చిత్రం
రాయలసీమ లవ్ స్టోరీ. రామ్ రణధీర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ పంచలింగాల బ్రదర్స్ నిర్మించిన చిత్రం రాయలసీమ లవ్ స్టొరీ. మరి ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్ళాల్సిందే.

కథేంటంటే :
రాయలసీమ ప్రాంతానికి చెందిన కృష్ణ ( వెంకట్ ) ఎస్ ఐ ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వస్తాడు. తన మిత్రుడు శృంగారం ( నల్ల వేణు) తో కలిసి అద్దెకు దిగుతాడు. అయితే ఇంటి కిరాయి కట్టకపోవడంతో ఓనర్ ఇల్లు ఖాళీ చేయిస్తాడు. అదే సమయంలో డాక్టర్ పల్లవి ఇంట్లో కృష్ణ , శృంగారం లకు షెల్టర్ ఇస్తుంది. పల్లవి ఇంటి ఎదురుగా ఉండే రాధ ( హృశాలి) ని చూసి లవ్ లో పడతాడు కృష్ణ. రాధ కూడా కృష్ణ ని ప్రేమిస్తుంది. అయితే అనూహ్యంగా రాధ వివాహం మరొకరితో నిర్ణయించబడుతుంది. దాంతో  పద్మ లాగే రాధ కూడా నన్ను మోసం చేసిందని కుమిలిపోతుంటాడు కృష్ణ. అసలు పద్మ ఎవరు ? కృష్ణ ప్రేమించింది ఎవరిని ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సమీక్ష….
మంచి కథ కథనం ఈ సినిమాకు ప్రధానమైన ప్లస్ పాయింట్స్. డైరెక్టర్ చాలా బాగా డీల్ చేశాడు. హీరోగా నటించిన వెంకట్ కు ఇది తొలి చిత్రమే అయినప్పటికీ ఎంతో అనుభవమున్న నటుడిలా అన్ని ఎమోషన్స్ పలికించాడు. ఎమోషనల్ సీన్స్ లోనే కాకుండా శృంగార సన్నివేశాల్లో అలాగే యాక్షన్ సీన్స్ లలో కూడా అదరగొట్టాడు. తప్పకుండా వెంకట్ కు మంచి భవిష్యత్తు ఉందని చెప్పొచ్చు. హీరోయిన్ లుగా నటించిన పావని , హృశాలి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. పావని నటనతో ఆకట్టుకుంటే హృశాలి శృంగార సన్నివేశాల్లో వీర లెవల్లో రెచ్చిపోయింది. లిప్ లాక్ లతో వెంకట్ , హృశాలి యూత్ ని ఆకట్టుకున్నారు. ఇక మిగిలిన పాత్రల్లో 30 ఇయర్స్ పృథ్వి , మిర్చి మాధవి , నల్లవేణు , జబర్దస్త్ బ్యాచ్ కొమరం , గెటప్ శ్రీను , రాజమౌళి , నాగినీడు తదితరులు తమ పాత్రలలో మెప్పించారు.

సాంకేతిక వర్గం :
పంచలింగాల బ్రదర్స్ ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. తక్కువ బడ్జెట్ లోనే చేసినప్పటికీ క్వాలిటీ పరంగా రాజీపడలేదు. ఇక దర్శకుడు రామ్ రణధీర్ విషయానికి వస్తే ….. అతడికి ఇది మొదటి సినిమానే అయినప్పటికీ యూత్ ని అలరించే అన్ని అంశాలతో రాయలసీమ లవ్ స్టొరీ చిత్రాన్ని రూపొందించాడు. యూత్ కి సందేశం ఇస్తూనే వాళ్లకు కావాల్సిన మసాలా ని అందించాడు. డైలాగ్స్ కూడా యూత్ కి విపరీతంగా నచ్చడం ఖాయం. కాస్త పరిధి దాటి డైలాగ్స్ ని రాసినప్పటికి అవి యువతిని మెచ్చేలా ఉన్నాయి. దర్శకుడిగా కొత్త అయినప్పటికీ తనకు కావాల్సిన నటనని నటీనటుల నుండి రాబట్టుకున్నాడు. 4 పాటలు యువతని విశేషంగా అలరించేలా ఉన్నాయి. నువ్వంటే   పిచ్చిపిచ్చి ….,  ముద్దు తొలి ముద్దు అనే పాటలు హైలెట్ గా నిలిచాయి. నేపథ్య సంగీతం కూడా అలరించేలా ఉంది. విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ బాగా కట్ చేశారు.

వెంకట్ నటన,  హృశాలి గ్లామర్,  ఎంటర్ టైన్ మెంట్,  పాటలు, డైరెక్షన్ ఈ సినిమాను నిలబెట్టాయి, రాయలసీమ లవ్ స్టొరీ యూత్ ని అలరించే సినిమా. సో గో అండ్ వాచ్.

PB Rating : 3/5