ఫిబ్రవరిలో శ్రీ పరమానందయ్య శిష్యుల కథ ప్రేక్షకుల ముందుకు!

ఫిబ్రవరిలో శ్రీ పరమానందయ్య శిష్యుల కథ ప్రేక్షకుల ముందుకు!

పింక్ రోజ్ సినిమాస్ బ్యానర్ పై ఎమ్. బాలాజీ నాగలింగం, శ్రీనివాస్ రావు బండి సమర్పణలో వస్తోన్న సినిమా శ్రీ పరమానందయ్య శిష్యుల కథ. తెలుగు చలన చిత చరిత్రలో ఇదే మొదటి 3డి సినిమా. వెంకట్ రాజేష్ పులి దర్శకత్వం వహించిన ఈ సినిమాను నిర్మాతలు కాటమ్ రెడ్డి శ౦తన్ రెడ్డి, సి.హెచ్.కిరణ్ శర్మ నిర్మించారు.

ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు బండి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ…
శ్రీ పరమానందయ్య శిష్యుల కథ 3D ఎఫెక్ట్స్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం. అందరూ ఎంజాయ్ చేసే విధంగా విజువల్స్ ఉండబోతున్నాయి. ప్రేక్షకులను ఆలోచింపజేస్తూనే ఈ సినిమా వినిదాన్ని పంచుతుంది. ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపారు.

డైరెక్టర్ వెంకట రాజేష్ పులి మాట్లాడుతూ….
75 సంవత్సరాల తొలి సినీ చరిత్రలో తొలి 3D బాలల చిత్రంగా దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 15న జరగనుంది. ఈ సినిమా కోసం శ్రమించిమ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కుటుంభ సమేతంగా శ్రీ పరమానందయ్య శిష్యుల కథ సినిమాను చూసి వినోదం పొందవచ్చని తెలిపారు.