నేనేమైనా రోబోనా… పవన్‌పై ట్విట్టర్‌లో రేణు సంచలన వ్యాఖ్యలు

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ గురించి తనను ఇంటర్వ్యూల్లో రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారని వీటిపై తాను స్పందించాల్సిన అవసరం లేదని పవన్ మాజీ వైఫ్ రేణుదేశాయ్ తెలిపారు. తనకు కొన్ని భావాలున్నాయని.. పవన్ గురించి తాను మాట్లాడిన ప్రతిసారి తాను ఆయన పేరును వాడుకుంటున్నట్టు విమర్శలు వస్తున్నాయని.. తానేమి రోబోను కాదని ఆమె అన్నారు. తన భర్త్‌డే సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా పవన్ గురించే ఎక్కువ ప్రశ్నలు అడిగారని ఆమె అసహనం వ్యక్తం చేశారు. 

పవన్‌కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న ఆమె ప్రస్తుతం తన పిల్లలతో కలిసి పూణేలో నివాసం ఉంటున్నారు. ట్విట్టర్‌లో తరచూ యాక్టివ్‌గా ఉండే ఆమె పవన్‌ను ప్రశంసిస్తూ ట్విట్లు చేస్తుంటారు. అయితే ఆమె పవన్ పేరును ఎక్కువగా వాడుకుంటుందన్న విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఆమె తీవ్రంగా స్పందిస్తూ ట్విట్ చేశారు. తాను తన కూతురు ఆద్య కోసం కవిత రాసినా కూడా తాను పవన్‌కు దగ్గరవుతున్నట్టు మాట్లాడుతున్నారు.. ఇది కరెక్ట్ కాదన్నారు. ఇలాంటి ప్రశ్నలకు స్పందించాల్సిన అవసరం లేకున్నా పదే పదే విమర్శలు రావడంతో స్పందించాల్సి వచ్చిందన్నారు.