కేసీఆర్‌ మందు.. కవిత బ్యాగులు మోయడానికే

మెదక్ ఉప ఎన్నికల సందర్భంగా భాజపా-తెరాస నాయకుల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. మంత్రి కేటీఆర్ జగ్గారెడ్డి, రేవంత్‌రెడ్డిని సమైక్యవాదులని విమర్శించారు. జగ్గారెడ్డికి ఈ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని ఆయన ఓటర్లకు సూచించారు. కాంగ్రెస్ విధానాలు కొని తెచ్చుకుంటున్న తేదేపా మెదక్ ఎన్నికకోసం కాంగ్రెస్ అభ్యర్థిని కొని తెచ్చుకుందని కేటీఆర్ అన్నారు. భాజపా అంటే బాబుగారి జగ్గారెడ్డి పార్టీ అని కేటీఆర్ వ్యగ్యంగా ఎద్దేవా చేశారు. 

కేటీఆర్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి, రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి విరుచుకుపడ్డారు. మరోసారి తమను సమైక్యవాదులు అని పిలిస్తే చెప్పుతో కొడతామని వారు హెచ్చరించారు. అయినా మెదక్ ఎంపీగా కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలిస్తే ఉపయోగం ఉండదన్నారు. ఆయన హైదరాబాద్‌లో ఉంటే కేసీఆర్‌కు తన ఫాంహౌస్‌లో మందు పోయడానికి, ఢిల్లీ వెళితే ఆయన కూతురు ఎంపీ కవిత బ్యాగులు మోయడానికే వాడుకుంటారే తప్ప పార్లమెంటులో మాట్లాడనీయరని రేవంత్ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్‌కు ఒక నీతి ఇతర పార్టీలకు మరో నీతా అని వారు విమర్శించారు. ప్రత్యేక రాయలసీమ డిమాండ్ చేసిన మజ్లిస్‌తో గ్రేటర్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేందుకు టీఆర్ఎస్ యత్నిస్తోందని ఆయన విమర్శించారు. కేసీఆర్ సొంత నియోకవర్గం గజ్వేల్‌లో 15 మంది ముక్కుపచ్చలారని పిల్లలు చనిపోతే వారిని పరామర్శిచండానికి కూడా ఆయన రాలేదని వారు మండిపడ్డారు.