బికినీ బేబ్స్ తో హల్ చల్ చేసిన చరణ్ “రోరీ” మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్

సిటిఎస్ స్టూడియోస్, ఎన్ టీవీ ఎంటర్ టైన్స్ మెంట్స్ సంయుక్తంగా చరణ్ రోరి నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం “రోరీ”….. ‘ఫక్ ఎవ్రీ వన్…. బికాస్ ఐ యామ్ ఫక్ డ్ బై ఎవ్రీ వన్’ అనే క్యాప్షన్ పెట్టారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ ప్రముఖ నిర్మాత నాగ సుశీల చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో బికినీలు వేసుకున్న నలుగురు హాట్ గాల్స్ “రోరీ” మూవీ లోగోను ప్రదర్శించి హల్ చల్ చేశారు. ఈ సందర్భంగా

మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ…… చరణ్ సర్ తో నాకు మంచి ట్రావెల్ ఉంది. నేను ఇప్పటివరకు చేసిన సాంగ్స్ , సినిమాలు ఒక స్టైల్ లో ఉంటాయి. కానీ ఇందులోని పాటలు వింటే భీమ్స్ మ్యూజిక్ చేశాడా అని అంటారు. నాలోని టాలెంట్ ను బాగా వాడుకున్నారు. డిఫరెంట్ స్టైల్లో పాటలు తీసుకున్నారు. ఎక్స్ పెక్ట్ చేయని లిరిక్స్, మ్యూజిక్,, లాంగ్వేజ్ ఉంటుంది. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. డిఫరెంట్ గా ఉంటుంది. టైటిల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. సినిమాలో ఓ తరహా కంటెంట్ ఉంటుంది. నా పేరు లో భీమ్స్ సిసిరోలియో… అనే పేరు ఇటాలియన్ లా ఉంటుంది. ఆ పేరుకు ఈ సినిమా సార్థకత అవుతుంది. అని అన్నారు.

నటుడు కాదంబరి కిరణ్ మాట్లాడుతూ….. ప్రస్తుతం వస్తున్న సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. చరణ్ నిర్మాతగా, దర్శకుడిగా ఓ డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్నాడు. నాకు మంచి పాత్ర ఇచ్చాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నత స్థాయికి వెళ్తాడు. ఈ సినిమా ట్యాగ్ లైన్ నాకు వర్తిస్తుంది. భీమ్స్ ప్రతీ సాంగ్ ని సూపర్ హిట్ గా ఇస్తాడు. ఈ సినిమా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ తో మంచి జర్నీ ఉంది. కోట శ్రీనివాసరావు గారితో కలిసి ఇందులో పనిచేయడం మంచి అనుభూతి. మంచి లక్షణాలతో ఉన్న ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. అని అన్నారు.

ప్రముఖ నిర్మాత నాగ సుశీల మాట్లాడుతూ… ఈ పోస్టర్ చూసి సర్ ప్రైజ్ అయ్యాను. చరణ్ వాళ్ల అమ్మ నాకు బాగా పరిచయం. నన్ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసారు. చరణ్ ను ఈరోజే కలిశాను. నాన్నగారు చరణ్ కు ఇన్స్పిరేషన్. ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి. నాన్న గారు చివరి వరకు నటించారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటాను. అని అన్నారు.

చరణ్ తేజ మాట్లాడుతూ…. సొసైటీలో బ్యాడ్ బాయ్స్ తప్ప గుడ్ బాయ్స్ లేరు. రియల్ లైఫ్ లో నా లైఫ్ కూడా ఈ సినిమా కథ లాగే ఉంటుంది. నేను మెడిసిన్ చదివాను. మనం చాలా మంది చేతిలో మోసపోయి ఉంటాం. అదే ఈ సినిమా కథ. నేను బ్యాడ్ బాయ్ ని. రియల్ లైఫ్ లో రీల్ లైఫ్ లో. సినిమాలో హీరోయిన్ ఉండదు. సినిమా మొత్తం ఫిగర్స్ ఉంటారు. నాగేశ్వరరావు గారిని చాలా సార్లు కలిశాను. రవీంద్రభారతికి వెళ్లే వాడిని. నాగ సుశీల గారు వచ్చి బ్లెస్ చేసారు. చాలా థాంక్స్. వారి ఫ్యామిలీకి రుణపడి ఉంటాను. అని అన్నారు.