సాహోలో అదే హైలైట్… సినిమా చూశాక మాట్లాడుకుంటారు….

సాహోలో అదే హైలైట్… సినిమా చూశాక మాట్లాడుకుంటారు….

ఒకే ఒక్క సినిమా చేసిన అనుభవం ఉన్న దర్శకుడికి 300కోట్ల సినిమా ఏ నమ్మకంతో ఇచ్చారని ముందు నుంచి కూడా అనుమానాలు వస్తూనే ఉన్నాయి. అసలు ఎలా అంత భారీ బడ్జెట్ సినిమా ఇచ్చారు అంటూ చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో మేకింగ్ వీడియోస్, టీజర్, ట్రైలర్ తో తను ఎంత మంచి దర్శకుడు అనేది చూపించాడు. ఇవి చూసిన తర్వాత సినిమాపై నమ్మకం కూడా వచ్చేసింది ప్రేక్షకులకు. ముందు నుంచి కూడా కొన్ని అనుమానాలు మాత్రం కచ్చితంగా అందర్లోనూ ఉన్నాయి. ఎందుకంటే అనుభవం లేని దర్శకుడు కాబట్టి ఏం చేస్తాడో అనే భయం అందర్లోనూ కనిపించింది. కానీ ఇప్పుడు అది లేదు. ఇప్పటికే తనేంటో నిరూపించుకున్నాడు సుజీత్. ఇప్పుడు ప్రభాస్ కూడా తన దర్శకుడి గురించి చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో ఓ సీన్ ఐదారుసార్లు వస్తుందని చెప్పాడు ప్రభాస్. దీన్నిబట్టి సుజీత్ పనితీరు ఏంటనేది తనకు అర్థమైందని చెప్పాడు ఈయన. ముఖ్యంగా ఆ సన్నివేశంలో ఐదు వేరియేషన్స్‌ ఉంటాయని.. యాక్టర్స్ యాంగిల్ లో చూసినా.. దర్శకుడి కోణంలో చూసినా… సినిమాలో చాలా క్లిష్టమైన సన్నివేశం ఇది అని చెప్పాడు ప్రభాస్. దాన్ని సుజీత్‌ తొలిరోజే తీసాడని చెప్పాడు ఈయన. అది చూసిన తర్వాత ఈ భారీ ప్రాజెక్ట్ సుజీత్ అద్భుతంగా తెరకెక్కిస్తాడనే నమ్మకం వచ్చినట్లు చెప్పాడు ప్రభాస్. ఆగస్ట్ 30న ప్రేక్షకులు కూడా ఇదే ఫీల్ అవుతారని చెబుతున్నాడు ఈయన