సహస్ర మూవీ మేకర్స్ మూవీ టైటిల్ “స్టార్”

సహస్ర మూవీ మేకర్స్ మూవీ టైటిల్ “స్టార్”

సహస్ర మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ సంజయ్ ( శరణం గచ్చామి ఫేమ్) హీన అచ్చర హీరో హీరోయిన్స్ గా వస్తున్న చిత్రానికి స్టార్ అనే టైటిల్ ని ఖరారు చేసి మీడియా సమావేశంలో లో స్టార్ టైటిల్ ని ప్రకటించారు. శ్రీహరి పట్టపు నిర్మాతగా, మాల్యాద్రి మామిడి (ప్రదీప్) దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సందర్భంగా హీరో నవీన్ సంజయ్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం నేను శరణం గచ్చామి మూవీలో లీడ్ చేసాను ఇప్పుడు సహస్ర మూవీ మేకర్స్ లో “స్టార్” మూవీ చేస్తున్నాను ప్రదీప్ మామిడి నాకు కథ చెప్పగానే నాకు బాగా నచ్చి ఒప్పుకున్నాను ఈ స్టార్ మూవీ లో నా కెరెక్టర్ ఒక స్ట్రీట్ ఫైటర్ గా చేస్తున్నాను నా బాడీ కి తగట్టు ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన శ్రీహరి గారికి మాల్యాద్రి (ప్రదీప్) గారికి థాంక్స్ అని చెప్పారు
హీరోయిన్ మాట్లాడుతూ ..
స్టార్ మూవీ లో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ప్రదీప్ సార్ ప్రొడ్యూసర్ శ్రీహరిగారికి చాలా థాంక్స్
ఈ చిత్రం లో నేను టైటిల్ రోల్ చేస్తున్నాను స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది. నా కో ఆర్టిస్ట్ నవీన్ గారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఈ మూవీ మాకు మంచి పేరు తెస్తుంది అని నమ్మకం ఉంది.
అపూర్వ శర్మ మాట్లాడుతూ… అందరికి నమస్కారం ఈ చిత్రం లో నేను ఒక డిఫరెంట్ రోల్ చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటునను.
ప్రొడ్యూసర్ శ్రీహరి పట్టపు మాట్లాడుతూ…
మీడియా మిత్రులకి అందరికి నమస్కారం మా దర్శకుడు మాల్యాద్రి మామిడి (ప్రదీప్) చెప్పిన కథ మాకు నచ్చిన వెంటనే సెట్స్ పైకి వెళ్లి మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది నాకు చూపిన దానికంటే దర్శకుడు బాగా ఔట్ ఫుట్ వస్తునందుకు ఆనందంగా ఉంది త్వరలో మిగతా షూటింగ్ పూర్తి చేసుకుంటాము మీ మీడియా సపోర్ట్ మా స్టార్ మూవీ కి ఉండాలి అని చెప్పారు
దర్శకుడు మాల్యాద్రి మామిడి మాట్లాడుతూ… మీడియా మిత్రులకు నమస్కారం మా సహస్ర మూవీ మేకర్స్ లో వస్తున్న చిత్ర టైటిల్ “స్టార్” ని ఈ రోజు మీడియా సమక్షం లో విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఈ “స్టార్” కథని నన్ను నమ్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మా నిర్మాత శ్రీహరి పట్టపు గారికి ప్రత్యక కృతజ్ఞతలు. ఈ చిత్రం లవ్ అండ్ యాక్షన్ కామెడీ తో పక్క కమర్షల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తునము. ఈ “స్టార్” మూవీ షూటింగ్ హీరో హీరోయిన్ లపై కొన్ని మెయిన్ టాకీ పార్ట్ హైదరాబాద్ లో 30% పూర్తి చేసుకుంది. ఈ నెలాఖరులో సెకండ్ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది ఈ షెడ్యుల్ తో మూవీ 70% పూర్తి చేసుకుంటుంది అని తెలిపారు.

టెక్నిషన్స్
కెమెరా : ఆర్.యమ్. స్వామి
స్టంట్స్: నబా , సుబ్బు
ఆర్ట్ డైరెక్టర్: పి. ఎస్. వర్మ
ఎక్సుక్యూటివ్ ప్రొడ్యూసర్ : రవి కుమార్
పి.అర్ .ఓ.: కడలి రాంబాబు
ప్రొడ్యూసర్: శ్రీహరి పల్లపు
డైరెక్టర్: మాల్యాద్రి మామిడి( ప్రదీప్