సాయిప‌ల్ల‌వికి అలాంటి సినిమాలు అంటే ఇష్ట‌మంట‌.. 

సాయిప‌ల్ల‌వి.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా ఏం చెప్పాలి..? ఇప్పుడున్న హీరోయిన్లు అంతా రెమ్యున‌రేష‌న్ స‌రిగ్గా వ‌చ్చిందంటే చాలు రోల్ ఎలా ఉన్నా కూడా సినిమా చేస్తున్నారు. కానీ సాయిప‌ల్ల‌వి మాత్రం అలా కాదు. కావాలంటే ఖాళీగా ఉంటాను కానీ సినిమాలో ఖాళీగా ఉండే పాత్ర మాత్రం చేయ‌నంటుంది. అంటే క‌థ‌లో త‌న‌కు కీల‌క పాత్ర ఇవ్వ‌క‌పోతే సినిమాలు చేయ‌న‌ని మొహం మీదే చెప్పేస్తుంది. త‌న‌కు సినిమాలు చేయ‌డం అనేది ప్యాష‌న్ అని.. ఇష్టం కాబ‌ట్టి న‌టిస్తున్నాని చెప్పింది ప‌ల్ల‌వి. త‌న‌కు అవ‌కాశాలు రాక‌పోతే డాక్ట‌ర్ వృత్తి చేసుకుంటాను కానీ డ‌బ్బుల కోసం ప్రాధాన్య‌త లేని పాత్ర‌లు మాత్రం చేయ‌న‌ని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ‌. 
రేప్పొద్దున త‌ను పెళ్లి చేసుకుని పిల్ల‌ల‌తో క‌లిసి త‌న సినిమాలు తాను చూసుకుంటున్న‌పుడు గ‌ర్వంగా ఉండాలి కానీ అయ్యో ఈ సినిమా అప్పుడెందుకు చేసానురా బాబూ అని బాధ ప‌డేలా మాత్రం ఉండ‌కూడ‌ద‌ని చెబుతుంది సాయిప‌ల్ల‌వి. అందుకే త‌న మ‌న‌సుకు న‌చ్చిన పాత్ర‌లు మాత్ర‌మే చేస్తూ వ‌స్తున్నాన‌ని చెబుతుంది ఈ బ్యూటీ. డ‌బ్బులు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి క‌దా అని ఎక్స్ పోజింగ్ చేయ‌డం.. గ్లామ‌ర్ పాత్రల వెంట ప‌డ‌టం.. క‌థ‌లో ఇంపార్టెన్స్ లేని పాత్ర వైపు ప‌రుగెత్త‌డం లాంటివి తాను అస్స‌లు చేయ‌నంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు తాను చేసిన సినిమాల‌న్నీ మ‌న‌సుకు న‌చ్చి చేసిన‌వే అని.. ఇప్పుడు చేస్తున్న విరాట‌ప‌ర్వంతో పాటు శేఖ‌ర్ క‌మ్ముల సినిమా కూడా అలాంటిదే అంటుంది సాయిప‌ల్ల‌వి. మొత్తానికి ఈమె కాన్ఫిడెన్స్ చూస్తుంటే మిగిలిన హీరోయిన్ల‌కు భ‌యం వేస్తుంది.