సాయిప‌ల్ల‌వి.. సావిత్రి వార‌సురాలా..?

సాయిప‌ల్ల‌వి.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఈ పేరుకు చాలా క్రేజ్ ఉంది. దానికి కార‌ణం ఫిదా. ఒక్క సినిమాతో అంద‌ర్నీ ఫిదా చేసింది ఈ భామ‌. ప్రేమ‌మ్ లో మ‌ల‌ర్ గా మాయ చేసిన సాయిప‌ల్ల‌వి.. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో పాగా వేసింది. అప్ప‌టి వ‌ర‌కు మ‌ల‌ర్ అని పిలిచిన వాళ్లంతా ఇప్పుడు ఆ పాత్ర‌ను మ‌రిచిపోయిన భానుమ‌తి అనేస్తున్నారు. నిజంగానే ఈమె హైబ్రిడ్ పిల్లరా బాబూ అంటున్నారు. ఫిదాలో సాయిప‌ల్ల‌వి న‌ట‌న చూసి ఫిదా కాని వాళ్లంటూ ఉండ‌రేమో..? ఇక ఫిదా స‌క్సెస్ మీట్ లో నాగ‌బాబు ఓ మాట ఎక్కువే అనేసాడు ఈ భామ గురించి. సాయిప‌ల్ల‌విని సావిత్రి నిజ‌మైన వార‌సురాలిగా చెప్పాడు నాగ‌బాబు. విన్న వారికి ఇది కాస్త అతిగా అనిపించొచ్చేమో కానీ సాయిప‌ల్ల‌వికి ఆ స్టేచర్ మాత్రం ఉంద‌నేది కొంద‌రి వాద‌న‌. క‌ళ్ళ నుంచి కాళ్ల వ‌ర‌కు అన్నింటితో కూడా అద్భుత‌మైన న‌టన ప‌లికించింది సాయిప‌ల్ల‌వి. మ‌రో రెండు సినిమాలు హిట్టైతే గ‌న‌క సాయి రేంజ్ మ‌రింత పెరిగిపోవ‌డం ఖాయం.