రెజీనాకు సాయిధ‌ర‌మ్ బైబై..కొత్త హీరోయిన్‌తో డేటింగ్‌

మెగా మేన‌ల్లుడిగా వెండితెర‌పై ఎంట్రీ ఇచ్చిన సాయిధ‌ర‌మ్ తేజ్ తొలి సినిమాతోనే సూప‌ర్ హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. చేసిన ఐదు సినిమాల్లో మూడు సినిమాలు హిట్ అయ్యాయి. ఈ మూడు సినిమాల్లో రెండు సినిమాల్లో రెజీనానే హీరోయిన్‌గా న‌టించింది. ఈ రెండు సినిమాల్లో వీరిద్ద‌రి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ సూప‌ర్బ్ అన్న టాక్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత కూడా వీరిద్ద‌రి ఆఫ్ స్క్రీన్ రొమాన్స్‌పై ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌చ్చాయి.

సాయి-రెజీనా ప్రేమ‌లో ఉన్నార‌ని..వీరు డేట్‌లో ఉన్న‌ట్టు కూడా టాలీవుడ్‌లో వార్త‌లు తెగ హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఇదిలా ఉంటే సాయి కొద్ది రోజులుగా రెజీనాతో గ్యాప్ మెయింటైన్ చేస్తున్నాడు. రెజీనాతో గ్యాప్ మెయింటైన్ చేస్తోన్న సాయి ఇప్పుడు మ‌రో హీరోయిన్‌తో డేటింగ్‌లో మునిగి తేలుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

సాయిధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న న‌క్ష‌త్రం సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో సాయి స‌ర‌స‌న కంచె ఫేం ప్ర‌గ్య‌జైశ్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. వీరిద్ద‌రి మ‌ధ్య తెర‌పై చ‌క్క‌గా కెమిస్ట్రీ పండేందుకు కృష్ణ‌వంశీ కొన్ని కెమిస్ట్రీ పాఠాలు వీరికి చెప్పాడ‌ట‌. మ‌రి అవి నిజంగా వ‌ర్క్ అవుట్ అయ్యాయేమో గాని వీరిద్ద‌రు సీక్రెట్‌గా డేటింగ్ స్టార్ట్ చేసేశార‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి.

అదే సినిమాలో త‌న‌కి మ‌రో మంచి స్నేహితురాలైన రెజీనా న‌టిస్తున్న‌ప్ప‌టికీ సాయిధ‌ర‌మ్ తేజ్ మాత్రం ప్ర‌గ్యాతో చెట్ట‌ప‌ట్టాలేసుకొని తిరుగుతున్నాడ‌ట‌. వారిద్ద‌రి మ‌ధ్య డేటింగ్ మ‌రో స్థాయికి వెళ్లింద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ జ‌నాలు ఒక‌టే గుస‌గుస‌లాడుకుంటున్నారు