సకల కళా వల్లభుడు మూవీ రివ్యూ

విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కించే చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అందుకే సకల కళా వల్లభుడు అనే డిఫరెంట్ టైటిల్ తో వస్తున్న సినిమాకు బజ్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్ర టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత అంచనాలు పెరిగాయి. తనిష్క్ రెడ్డి , మేఘాల ముక్త జంటగా శివ గణేష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరి ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథేంటంటే :
తనిష్క్(తనిష్క్ రెడ్డి), చైత్ర (మేఘాల ముక్తా) తో ఫస్ట్ లుక్ లోనే ప్రేమలో పడతాడు. అయితే అతని ప్రవర్తన నచ్చకపోవడంతో పట్టించుకోదు. అదే సమయంలో చైత్రను కిడ్నాప్ చేస్తారు. ఇంతకీ ఈ చైత్ర ఎవరు? ఆమెను ఎందుకు కిడ్నాప్ చేస్తారు? ఆమె గతం ఏమిటి ? తనిష్క్ ఆమె ను ఎలా కాపాడుతాడు అనే విషయాలు తెలియాలంటే ఈచిత్రం చూడాల్సిందే.

సమీక్ష
హీరో తనిష్క్ రెడ్డి తనదైన పెర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. యాక్షన్ పార్ట్ విషయంలో తన సత్తా చూపించాడు. పక్కా కమర్షియల్ హీరోకు కావాల్సిన ఎబిలిటీస్ ఉన్నాయి. ఈ సినిమా తనకు మంచి పేరు వస్తుంది. హీరోయిన్ మేఘాల చూడటానికి బాగుంది. హీరోతో మంచి కెమిస్ట్రీ మెయింటైన్ చేసింది. ఇద్దరి మధ్య లిప్ కిస్ సీన్ హాట్ గా ఉంది. చిన్నాకు మంచి క్యారెక్టర్ దొరికింది. చాలా కాలం తర్వాత చిన్నాను మంచి పాత్రలో చూశాం. కొన్ని సీన్స్ లో కామెడీ చేసి నవ్వించాడు. ఇంటర్వెల్ ముందు వచ్చే హీరోయిన్ కిడ్నాప్ కు గురైన సన్నివేశాలు చాలా ఆసక్తిరొకరంగా అనిపిస్తాయి. ఇక జబర్దస్ ఫేమ్ రాము మరియు అతని స్నేహితులు హీరో కి సపోర్ట్ చేసే పాత్రలో చాలా బాగా నటించారు. నటనా పరంగా దర్శకుడు అందరి నుంచి మంచి నటన రాబట్టుకున్నాడు. ఆర్టిస్టులు సెలెక్షన్ బాగుంది.

హీరో పాత్రను ను ఎస్టాబిలేష్ చేసిన విధానం బాగుంది. తరువాత వచ్చే సన్నివేశాలతో సినిమా గ్రాఫ్ పెరిగింది. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా గడిచిపోతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరింది. ఇంటర్వెల్ బ్లాక్ ని బాగా డిజైన్ చేశాడు దర్శకుడు. హీరో హీరోయిన్ ను ఏడిపించే సీన్స్ సరదాగా సాగుతాయి. పెద్ద సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్ తర్వాత ఇంట్రస్టింగ్ గా సాగుతుంది. ఊహించని సీన్స్ తో ముందుకెళ్తుంది. హీరోయిన్ ను కాపాడేందుకు హీరో చేసే సాహసాలు బాగున్నాయి. కమెడియన్ పృథ్విరాజ్ , జీవ పాత్రలు ఇంట్రస్టింగ్ గా ఉంటాయి.

నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే విలేజ్ నేపథ్యంలో షూట్ చేసిన విజువల్స్ బాగున్నాయి. అజయ్ సంగీతం, నేపథ్య సంగీతం డీసెంట్ గా వుంది. ఇక డైరెక్టర్ శివ గణేష్ విషయానికి వస్తే దర్శకుడిగా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇంట్రస్టింగ్ సన్నివేశాలతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచాడు. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీని బాగా మెయింటైన చేశాడు. రొమాంటిక్ డ్రామా గా సాగిన ఈ సినిమా అందరికీ నచ్చేలాగా ఉంది.

ఫైనల్ గా….

రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కిన ఈ సకల కళా వల్లభుడు చాలా చోట్ల ఇంట్రస్టింగ్ సీన్స్ లో సాగుతుంది. కామెడీ సన్నివేశాలు హైలైట్ అవుతాయి. అవసరమైన చోట సస్పెన్స్ తో క్యూరియాసిటీ పెంచాడు. సరదాగా సాగే సినిమా కాబట్టి థియేటర్లో హ్యాపీగా ఎంజాయ్ చేయెచ్చు.

PB Rating : 3/5