స‌ల్మాన్ ఖాన్ మళ్లీ జైలుకెళ్తాడా….?

స‌ల్మాన్ ఖాన్ ఎప్పుడూ ఏదో ఓ వివాదంలో ఉంటాడు. కాంట్ర‌వ‌ర్సీలు లేక‌పోతే ఆయ‌న‌కు నిద్ర కూడా ప‌ట్ట‌దేమో మ‌రి.. అయితే కొన్ని రోజులుగా అన్నీ మానేసి త‌న ప‌ని తాను చేసుకుంటున్నాడు ఈయ‌న‌. త‌న సినిమాలు.. త‌న కుటుంబం.. త‌న ప‌నులు ఇవే కొన్నేళ్లుగా స‌ల్మాన్ జీవితం. అయినా కూడా ఇప్ప‌టికీ ఆయ‌న్ని కోర్టులు, కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. ఎప్పుడో 20 ఏళ్ల కింద హ‌మ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగ్ లో భాగంగా రాజస్థాన్ వెళ్లిన స‌ల్మాన్ ఖాన్.. అక్క‌డ తోటి న‌టుల‌తో క‌లిసి కృష్ణ‌జింక‌ల‌ను వేటాడాడు. ఆ కేసు 20 ఏళ్లు నానిన త‌ర్వాత కోర్ట్ అత‌న్ని దోషిగా తేల్చింది. 2018 ఎప్రిల్ 5న ఈ తీర్పు వ‌చ్చిన త‌ర్వాత రెండు రోజులు జైల్లో కూడా ఉన్నాడు కండ‌ల‌వీరుడు.
ఆ త‌ర్వాత బెయిల్ మీద బ‌య‌టికి వ‌చ్చాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన విచార‌ణ‌ల‌కు స‌ల్మాన్ రావ‌డం లేదు. ఇప్ప‌టికే చాలా సార్లు ఈ కేసులో కోర్ట్ అత‌న్ని హెచ్చ‌రించినా కూడా ప‌ట్టించుకోలేదు. దాంతో ఇప్పుడు వార్నింగ్ ఇచ్చింది జోధ్ పూర్ కోర్ట్. సెప్టెంబర్ 27న జ‌రిగే హియ‌రింగ్ కు కానీ స‌ల్మార్ నాలేదంటే ఆయ‌న బెయిల్ ర‌ద్దు చేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చింది. దాంతో ఇప్పుడు కండ‌ల‌వీరుడికి షాక్ త‌గిలింది. క‌చ్చితంగా ఈ కేసు విచార‌ణ‌కు వ‌చ్చి ఏదో ఒక‌టి కోర్టుకు చెప్పాలి. మ‌రి ఇప్పుడు స‌ల్మాన్ ఏం చేస్తాడో చూడాలిక‌. ఏ మాత్రం తేడా జ‌రిగినా కూడా ఈ సారి స‌ల్మాన్ ఖాన్ జైలుకు వెళ్ల‌డం ఖాయం.