శేఖర్ హ్యాపీడేస్ నిర్మిస్తున్న సల్మాన్ ఖాన్

సల్మాల్ ఖాన్ దక్షిణాది చిత్రాలంటే మక్కువ ఎక్కువ. అందుకే తెలుగులో సూపర్ హిట్టయిన పలు సినిమాలను హిందీకి తీసుకెళ్లాడు. ఆయన నటించిన పలు రీమేక్ సినిమాలు బంపర్ హిట్ కొట్టాయి. ఇప్పుడు తాజాగా మరో సినిమాను హిందీకి తీసుకెళ్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఆయన నటించట్లేదు. కేవలం నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తెలుగులో బంపర్ హిట్ కొట్టి ట్రెండ్ క్రియేట్ చేసిన శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ చిత్రాన్ని కండలవీరుడు హిందీలో నిర్మిస్తున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల ధృవీకరించాడు. 

హిందీ హ్యాపీడేస్ స్క్రిప్ట్ వర్క్ తుది దశకు చేరుకుంది. ఆర్టిస్టుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే ఈసినిమా ప్రారంభం కానుంది. 

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నయనతార హీరోయిన్ గా తెరకెక్కించిన అనామిక మే 1న విడుదలౌతోంది.