సమంత యు ట‌ర్న్ సెన్సార్ రిపోర్ట్ వింటే షాకవుతారు….

సమంత ప్రధానపాత్రలో నటించిన చిత్రం యు ట‌ర్న్. ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ‘U/A’ స‌ర్టిఫికేట్ ఇచ్చారు. సెప్టెంబ‌ర్ 13న సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ప‌వ‌న్ కుమార్ ఈ చిత్రాన్ని మిస్ట‌ర్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించాడు. అయితే ఈ చిత్ర బిజినెస్ ని నిర్మాతలు మంచి రేట్లకే అమ్మారు. కానీ సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉండబోతుందా అనే ఆతృత మాత్రం అందరిలో ఏర్పడింది. అయితే సినిమా చూసిన సెన్సార్ సభ్యులు షాక్ అయ్యారట. సూపర్ హిట్ సినిమా చూశామనే సంతృప్తి వ్యక్తం చేశారట. కమర్షియల్ గా అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే ఎలిమెంట్స్ ఉన్నాయని దర్శక నిర్మాతల్ని మెచ్చుకున్నారుట. అంతే కాదు. సమంత పెర్ ఫార్మెన్స్ చూసి షాక్ అయ్యారని తెలిసింది. ఈ మధ్యే రంగస్థలంతో డిఫరెంట్ గెటప్ లో అందరి మనసుల్ని దోచుకున్న సమంత… యూ టర్న్ తో తన కెరీర్లోనే ఇంటెన్సిటీ ఉన్న పాత్రలో మెప్పించిందనే విషయాన్ని సెన్సార్ సభ్యులు వ్యక్తం చేశారని ఫిలింనగర్ వర్గాలంటున్నాయి.

ఏదైనా… యూ టర్న్ తో నిర్మాతలుగా ఎంట్రీ ఇస్తున్న శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారికి మంచి హిట్ పడ్డట్టే. ఈ సినిమా బిజినెస్ కూడా పూర్తవడం, సెన్సార్ రిపోర్ట్ ఫుల్ పాజిటివ్ రిపోర్ట్ రావడంతో… ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

యు ట‌ర్న్ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, త‌మిళ్ లో తెర‌కెక్కించారు. రెండు భాష‌ల్లోనూ ఒకేరోజు విడుద‌ల కానుంది. రాహుల్ ర‌వీంద్ర‌న్ ప్ర‌ధాన‌పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రంలో భూమికా చావ్లా ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. పూర్ణ‌చంద్ర తేజ‌స్వి ఈ చిత్రానికి సంగీతం అందించారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు హైలైట్ కానుంది. శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్ మ‌రియు వివై కంబైన్స్ బ్యాన‌ర్స్ పై శ్రీ‌నివాస చిట్టూరి, రాంబాబు బండారు యు ట‌ర్న్ చిత్రాన్ని నిర్మించారు.

న‌టీన‌టులు:
స‌మంత అక్కినేని, ఆది పినిశెట్టి, భూమికా చావ్లా, రాహుల్ ర‌వీంద్ర‌న్, న‌రైన్

సాంకేతిక విభాగం:
క‌థ‌, ద‌ర్శ‌కుడు: ప‌వ‌న్ కుమార్
నిర్మాత‌లు: శ్రీ‌నివాస చిట్టూరి, రాంబాబు బండారు
బ్యాన‌ర్స్: శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్ మ‌రియు వివై కంబైన్స్
సంగీతం: పూర్ణచంద్ర తేజ‌స్వి
సినిమాటోగ్ర‌ఫీ: నికేత్ బొమ్మి
ఆర్ట్ డైరెక్ట‌ర్: ఏఎస్ ప్ర‌కాశ్
ఎడిటర్: సురేష్ ఆర్ముగం
పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్