సమంత యూ టర్న్ కి థ్రిల్లింగ్ టర్నింగ్ కలెక్షన్స్….

సమంత మెయిన్ లీడ్ లో రూపొందించిన యూ టర్న్ మంచి అంచనాలతో గ్రాండ్ రిలీజైంది. ఈ చిత్రం ఎలాంటి ఫలితం ఇస్తుందో అని అంతా ఎదురుచూశారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు మల్టీప్లెక్స్ సినిమాగా చెప్పుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా బి, సి సెంటర్స్ కూడా హౌస్ ఫుల్ కావడం అందరినీ షాక్ కి గురి చేసింది.

సమంత స్టామినా ఏంటో ఈ సినిమాతో ప్రూవ్ అయ్యింది. రిలీజ్ కు ముందే టేబుల్ ప్రాఫిట్ గా ఈ సినిమా రిలీజైంది. నిర్మాతలు అక్కడే సేఫ్ అయ్యారు. ఇక విడుదలైన రోజు వచ్చిన ఓపెనింగ్స్ చూస్తుంటే డిస్ట్రిబ్యూటర్స్ భారీ లాభాలు అందుకునేలా కనిపిస్తున్నారు. వినాయకచవితి రోజు విడుదల కావడంతో… ముఖ్యంగా యూత్ సమంత కోసం థియేటర్లలో నిండిపోయారు. ఇప్పుడు టాక్ ని బట్టి, పాజిటివ్ రివ్యూల్ని బట్టి… అన్ని థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి. ఈ లెక్కన… రాబోయే మూడు రోజులు భారీ కలెక్షన్స్ రాబడుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

కథ, కథనం… నటీనటుల పెర్ పార్మెన్స్, డైరెక్టర్ టేకింగ్ ప్రేక్షకుల్ని థ్రిల్ కు గురి చేసింది. ఆశించిన దానికంటే ఎక్కువ కంటెంట్ ఉండడం… సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్నాయి. అంతర్లీనంగా మంచి మెసేజ్ చెప్పడం విశేషం. దీనికి ఆడియెన్స్ ఫ్లాట్ అయిపోయారు. ఓవరాల్ గా సమంత క్రేజ్ తో భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి.