డైరెక్టర్ గా వర్మ హీరోగా సంపూ నిర్మాతగా విష్ణు

ఈ కాంబినేషన్ వింటేనే ఆశ్చర్యకరంగా ఉంది కదా. నిజంగానే వీరు ముగ్గురు కలిసి సినిమా నిర్మిస్తే ఎలా ఉంటుంది. ఊహకే అందట్లేదు కదా. కానీ అన్నీ కుదిరితే ఇది నిజం కూడా కావచ్చని ఫిలింనగర్ వర్గాలంటున్నాయి. అవును ఇటీవలే సంపూర్ణేష్ బాబు హృదయకాలేయం చిత్రంతో హల్ చల్ చేశాడు. బర్నింగ్ స్టార్ గా బాక్సాఫీస్ బరిలో నిలిచి గెలిచాడు. ఇప్పుడు ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు రాంగోపాల్ వర్మ రెడీ అయ్యాడు. 

సంపూ యాక్టింగ్ చూడగానే వర్మకు ఓ డిఫరెంట్ థాట్ వచ్చిందట. గతంలో చాలా ఎక్స్ పెరిమెంట్స్ చేసిన ఆయన ఈసారి సంపూతో  ఓ యాక్షన్ కామెడీ చేయించేందుకు రెడీ ఆవుతున్నాడట. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడట. 

సంపూర్ణేష్ ప్రస్తుతం హృదయకాలేయం దర్శకుడు సాయి రాజేష్ డైరెక్షన్లోనే కొబ్బరి మట్ట అనే సినిమా చేస్తున్నాడు.