మరోసారి సంపుతానంటున్న సంపూర్ణేష్

చిరంజీవి, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. ఇక ఇండస్ట్రీని ఎవర్రా కాపాడేది అనుకుంటున్న టైంలో దిగాడో పొట్టోడు. నల్లగా ఎత్తు పల్లేసుకొని సంచలనాలు సృష్టించాడు. హృదయ కాలేయం అనే తిక్క టైటిల్ పెట్టుకొని ఓ పిచ్చ ఫోజుతో యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఓనర్లకే బోర్ కొట్టే రీతిలో పబ్లిసిటీ సంపాదించాడు. అతనే సంపూర్ణేష్ బాబు. బాబులకే బాబుని తయారు చేశాడు రాజేష్ అలియాస్ స్టీవెన్ శంకర్. ఈ మాస్టారు సంపూని బాగా వాడుకున్నాడు. ఫలితంగా హృదయ కాలేయం అనే సినిమాను బయటికి తీసుకొచ్చాడు. సినిమాను హిట్టు చేసుకొని సంబరాలు చేసుకొని సల్లబడ్డారు. సర్లే సినిమా వచ్చింది… ఆడింది…పోయింది అని అనుకున్నారంతా..అయితే ఈ సంపూ బాబు మాత్రం నిను వీడని నీడను నేను టైప్ లో మళ్లీ వస్తాడట. హృదయ కాలేయం రీ రిలీజ్ చేసి పక్క సినిమాల కలెక్షన్లు సంక నాకిచ్చేస్తాడట. 

సంపూ హృదయ కాలేయం చిత్రాన్ని మే 9న మళ్లీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ రీ రిలీజ్ తో మరిన్ని రికార్డులు కొట్టేసి రీ రికార్డులు కొట్టిన ఘనత మాదే అని మళ్లీ ప్రచారం మొదలు పెడతాడట. ఏంట్రా మాకీ హింస అని ప్రేక్షకులు అనుకున్నా… సమస్యే లేదు హృదయకాలేయం మళ్లీ చూడాల్సిందే అంటున్నాడు. ఎనీ వే ఆల్ ది బెస్ట్ టూ సంపూ అండ్ గ్యాంగ్.