సందీప్ కిషన్ టైగర్ స్టోరీ లైన్ ఇదే…ఫస్ట్ లుక్ అదుర్స్

సందీప్ కిషన్, రన్ రాజా రన్ ఫేమ్ సీరత్ కపూర్ జంటగా రూపొందుతున్న చిత్రం టైగర్. ఏ.ఆర్.మరుగదాస్ శిష్యుడు వి.ఐ.ఆనంద్ దర్శకునిగా పరిచయమౌతున్నారు. ఇద్దరు అగ్ర నిర్మాతలు ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను సోమవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత ఎన్.వి.ప్రసాద్ సమర్పకుడు  మాట్లాడుతూ.. ఇది ఎక్స్ ట్రార్డినరీ కథ. సందీప్ కిషన్ కు సరిగ్గా సరిపోతుంది. అతనిని హీరోగా మరో స్థాయికి తీసుకెళ్లే సినిమా అవుతుంది. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తీర్చిదిద్దుతున్నాం. కాశీ, అలహాబాద్, బొబ్బిలి లాంటి విభిన్న ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపాం. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. దాదాపుగా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈనెల పద్నాలుగున ఐ సినిమాతో పాటు ఫస్ట్ టీజర్ ను థియేటర్లలో విడుదల చేస్తున్నాం. అని తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ… కాశీ నేపథ్యంలో సాగే కథ ఇది. వినోదానికి ప్రాధాన్యమున్న మంచి యాక్షన్ థ్రిల్లర్ ఇది. అని చెప్పారు. ఈ కథను తాను బాగా నమ్మానని సందీప్ కిషన్ పేర్కొన్నారు.