సంజీవని మూవీ రివ్యూ…

గ్రాఫిక్స్ తో కూడిన సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకు తెగ ఇష్టం. అందునా గ్రాఫిక్స్ తో కూడిన బాహుబలి లాంటి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో చాలా మంది దర్శకులు గ్రాఫిక్స్ ప్రధానంశంగా పెట్టుకొని కథలు రాసుకుంటున్నారు. అయితే తొలి చిత్రమే గ్రాఫిక్స్ ప్రధానంగా అడ్వెంచరస్ మూవీ సంజీవని తెరకెక్కించాడు రవి వీడే. ఈ చిత్ర టీజర్స్ రిలీజ్ అయినప్పుడే వావ్ అన్నారంతా. లో బడ్జెట్ తో తెరకెక్కిన హై గ్రాఫిక్స్ చిత్రంగా పేరు తెచ్చుకుంది. అంతా కొత్తవారే నటించిన ఈ చిత్రం కోసం చాలానే కష్టపడ్డారు. దాదాపు రెండు సంవత్సరాలు ఈ సినిమా కోసం కష్టపడ్డారు. మరి వీరి కష్టం ఎంత వరకు సక్సెస్ అయ్యిందో చూద్దాం. 

 

కథ విషయానికి వస్తే….

పర్వాతా రోహకుల చుట్టూ జరిగే అడ్వెంచరస్ స్టోరీ ఇది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన టీం కు ఓ బంపర్ ఆఫర్ తగులుతుంది. ఇప్పటివరకు ఎవ్వరూ ఎక్కని… ఎక్కినా బతికి వెనక్కి రాని పర్వతాన్ని ఎక్కి… అక్కడి రహస్యాల్ని తెలుసుకునే టాస్క్ వీరి చేతికి వస్తుంది. ఆ టాస్క్ ఫినిష్ చేస్తే 5 కోట్ల పారితోషికం ఆశ చూపిస్తారు. అలాంటి సంజీవని పర్వతం ఎక్కేందుకు ట్రై చేస్తారు పర్వతారోహకులు. అయితే ఆ పర్వతం ఎక్కితే చనిపోతారని తెలిసినా… ఓ సాధావు వారించినా.. పర్వతం ఎక్కేందుకు ప్రయత్నిస్తారు. ఈ పర్వతం ఎక్కేటప్పుడువారికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. చివరికి వారు అనుకున్న టాస్క్ ఫినిష్ చేయగలిగారా లేదా అన్నది థియేటర్లోనే చూడాలి. 

 

సమీక్ష

సంజీవని సినిమా చూసిన వారికి ఫస్ట్ షాక్ కి గురవుతారు. చాలా చిన్న బడ్జెట్ లో ఇంత క్వాలిటీ గ్రాఫిక్స్ తో ఎలా తీశారు అనే సందేహం రాకమానదు. అలాగే పర్వతాల్ని రియల్ గానే ఎక్కారా… గ్రాఫిక్స్ లో మేనేజ్ చేశారా అనే అనుమానాలు రాకమానవు. ఈ సినిమా కోసం డైరెక్టర్ తో పాటు, గ్రాఫిక్స్ టీం, నటీనటులు చాలా అంటే చాలానే కష్టపడ్డారు. దాదాపు రెండు సంవత్సరాల కష్టం వీరిది. గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఇప్పటివరకు మనం చూడని విధంగా పెద్ద పెద్ద సాలె పురుగులు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. అంతే కాదు.. క్లైమాక్స్ లో వచ్చే పెద్ద పెద్ద గద్ద ఆకారంలో ఉన్న పక్షుల్ని బాగా డిజైన్ చేశారు. పర్వతాల్ని బాగా చూపించారు. ఇందులో ప్రతీ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది. అక్కడక్కడ ట్విస్టులు, టర్నులతో కథ ముందుకు వెళ్తుంది. ప్రతీ దానికి మంచి లాజిక్ రాసుకున్నాడు. కథను దర్శకుడు రవి బాగా డిజైన్ చేసుకున్నాడు. స్క్రీన్ ప్లే రన్ చేసిన విధానం అందరికీ నచ్చుతుంది. ఆసక్తి నెలకొల్పే సన్నివేశాలు, సాలె పురుగుల ఎటాక్ షాక్ కి గురి చేస్తుంది. దీంతో పాటు ఫ్రెండ్స్ మధ్య వచ్చే తగాదాలు, అనుమానాలు, లవ్ ట్రాక్స్ బాగున్నాయి. హెలికాప్టర్ లో సినిమా ప్రారంభంలో వచ్చే సీన్స్ తో కథపై ఆసక్తి కలిగించాడు దర్శకుడు. ఇదే కథను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తే మరోలో ఉండేదేమో అనిపించింది. కానీ తనకిచ్చిన లిమిటెడ్ బడ్జెట్ తో చాలా క్వాలిటీ గ్రాఫిక్స్ తో తెరకెక్కించి దర్శకుడు రవి సక్సెస్ సాధించాడు. కెమెరామెన్ పర్వాత ప్రాంతాల్ని అడవిని చాలా బాగా చూపించాడు. ప్రతీ ఆర్టిస్టుకి మంచి పేరొస్తుంది. తమ ఎఫెర్ట్స్ సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే గ్రాఫిక్స్ హనుమంతుడు.. డైరెక్టర్ జస్టిఫికేషన్ బాగున్నాయి.

 

అడ్వెంచరస్ సినిమాలు చేయడం నిజంగానే అడ్వెంచరే. ఎందుకంటే అందులో రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ రవి అండ్ టీం ఆ అడ్వెంచర్ ను సక్సెస్ ఫుల్ గానే పూర్తి చేయగలిగారు. ఎంత కష్టమైనా తాను అనుకున్న ఔట్ పుట్ వచ్చే వరకు కృషి చేశాడనిపించింది. కేవలం గ్రాఫిక్స్ మాత్రమే కాకుండా మ్యూజిక్, కెమెరా వర్క్ మీద చాలా శ్రద్ధ పెట్టాడు. వారి మధ్య వచ్చే డైలాగ్స్ కూడా బాగా రాసుకున్నారు. హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే ఎమోషనల్ లవ్ సీన్స్ చాలా సహజంగా అనిపించాయి. ప్రాణం విలవను బాగా చూపించాడు దర్శకుడు. ఆశ అత్యాశల మధ్య మనుషులు ఎలా మారతారో చూపించాడు. నిర్మాతలు కూడా దర్శకుడికి బాగా సపోర్ట్ చేశారనిపిస్తుంది. 

 

ఓవరాల్ గా 

చిన్న బడ్టెట్ సినిమా అంటే చీప్ గా తీసి పారేసే రోజులు మెల్లగా పోతున్నాయి. దానికి ఉదాహరణే సంజీవని చిత్రం. తక్కువ బడ్జెట్ లో విభిన్నమైన కథాంశం ఎన్నుకొని ఎలా రూపొందించాలనేది ఈ సినిమాను చూసి నేర్చుకోవాలి. గ్రాఫిక్స్ అంటే భారీ బడ్జెట్ అవసరం లేదని ప్రూవ్ చేశారు. డిఫరెంట్ గా ట్రై చేస్తే తెలుగు ప్రేక్షకులు తప్పుకుండా ఆదరిస్తారు. సంజీవని చిత్రం కూడా ఆ కోవలోకే వస్తుంది. అబ్బురపరిచే సన్నివేశాలు, గ్రాఫిక్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని తప్పుకుండా ఎంటర్ టైన్ చేస్తాయి. గో అండ్ వాచిట్. 

PB Rating : 3/5