ఈ నెల 5న విడుదలవుతున్న ‘సారథి’ చిత్రం.

ధను క్రియేషన్స్ పతాకం పై అల్లం భువన్ దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం ‘సారథి’.  నూతన పరిచయంగా రేవంత్ జి. హెచ్, సమ్మోహిత్, అనిత రాఘవ, తేజా రెడ్డి లు హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు..  ఈ చిత్రం జనవరి 5న గ్రాండ్ రిలీజ్ కానుండంతో చిత్ర భృందం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మరియు నిర్మాత అల్లం భువన్ మాట్లాడుతూ ఇది నా మొదటి సినిమా.. హీరో, హీరోయిన్స్  కష్టపడి నటించారు. మొదట అందరూ భయపడ్డారు నా మొదటి సినిమా కావడంతో ఎలా తీస్తాడో అని, కానీ సినిమా మొత్తం అయ్యాక బాగొచ్చిందని అభినందించారు. ఏ సినిమా అయినా హిట్ అవ్వాలంటే సినిమాలో డైలాగ్స్ బాగుండాలి.. ఈ సినిమాలో రంజిత్ చాలా అధ్బుతంగా Bడైలాగ్స్ ను రాశారు.  ఇక ఈ సినిమా కాన్సెప్ట్ విషయానికి వస్తే.. నిజాయితీగా ఉండటమే రాజకీయ నాయకుల, పోలీసుల విధి అనేది సారథి చిత్ర సారాంశం…  ఈనెల 5న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయనున్నాము.. అందరికీ నచ్చే సినిమా అవుతుందని నమ్ముతున్నా అన్నారు. 

హీరో రేవంత్ మాట్లాడుతూ 25  షార్ట్ ఫిలిమ్స్ లో నటించాను. మొదటి సారి బిగ్ స్క్రీన్ తో హీరో గా పరిచయం అవుతున్నా… అసలు ఇండస్ట్రీ అంటే ఏంటో మాకు తెలియదు అయినా సినిమా చేయాలనే ప్యాషన్ తో సారథి ను చేయడం జరిగింది. మంచి స్క్రిప్ట్ ను ఎంకరేజ్ చేసిన భవన్ గారికి కృతజ్ఞతలు. ఈ చిత్ర గీతాలను సెప్టెంబర్ 24న వైజాగ్ లో విడుదల చేసాము. మంచి స్పందన వచ్చింది. నా మొదటి సినిమా తోనే బానుచందర్ లాంటి బిగ్ ఆర్టిస్ట్ తో కలసి నటించినందుకు హ్యాపీ గా ఉంది. పేరుకే చిన్న మూవీ కానీ స్క్రిప్ట్ కు కాదు.. అందరూ ఈ సినిమాను ఆదరించాలని కోరుతున్నా అన్నారు. హీరోయిన్ అనిత రాఘవ మాట్లాడుతూ ఈ చిత్ర  కథ చాలా బాగుంది.. చూసే వారికి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. నేను చాలా కంఫర్టబుల్ గా నటించాను.. అందరూ బాగా చూసుకున్నారు.. ఈ సినిమాలో మ్యూజిక్ హైలెట్. టీమ్ హార్డ్ వర్క్ ఫిల్మ్ అని చెప్పొచ్చు… ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేశారు. సినిమాను తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు. అతిథి  జి. సురేష్ కుమార్ మాట్లాడుతూ మంచి కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా సారథి. హీరో రేవంత్ మా బ్యానర్ లో రాబోతున్న   కొత్త సినిమాలో నటిస్తున్నారు.. అతను చాలా డెడికేటెడ్ పర్సన్. సారథి చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుందని ఆశిస్తూ… చిత్ర యూనిట్ కు నా శుభాకాంక్షలు తెలుపుతున్నా అన్నారు… 

 

రేవంత్, సమ్మోహిత్, అనిత రాఘవ, తేజారెడ్డి, బానుచందర్, మల్లాది రాఘవ, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్: నాగరాజు, ఎడిటింగ్: నందమూరి హరి, సినిమాటోగ్రఫీ: టి.కె. పరందామ, సంగీతం: వి. కిరణ్ కుమార్, కో-డైరెక్టర్: పృధ్వి ఆర్ బి ఎస్. సింథిల్ కుమార్, కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం- నిర్మాత: అల్లం భువన్.