సవ్యసాచి మూవీ రివ్యూ రేటింగ్

వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ గురించి ఎంతమందికి తెలుసు… చాలా తక్కువ మందికి తెలిసుండొచ్చు. ఆ సిండ్రోమ్ గురించిన సినిమానే సవ్యసాచి. నాగచైతన్య హీరో. నిధి అగర్వాల్ హీరోయిన్. చందూ మొండేటి దర్శకుడు. మాధవన్ విలన్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం. ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన ఈ సినిమా ఎలా ఉందంటే…

డైరెక్టర్ చందూ డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకున్నాడు. కథా పరంగా బాగానే ఉందనిపిస్తుంది. కానీ ఎగ్జిక్యూషన్ లోనే తేడా కొట్టింది. సినిమా అలా సింపుల్ గా వెళ్తుంటుంది. కానీ పెద్దగా ట్విస్టులు, టర్న్ లు, ఎమోషన్స్ కనిపించవు. సాదా సీదాగా కథను సాదా సీదా సీన్స్ తో నడిపించాడు. సిండ్రోమ్ గురించి చెప్పడానికి చాలా టైం తీసుకున్నాడు దర్శకుడు. సన్నివేశాలు మెల్లగా వెళ్తుంటాయి. స్లో నరేషన్ కొంప ముంచింది. ఆశించినన్ని అద్భుతమైన సీన్స్ కనిపించకపోవడం మైనస్. ఈ తరహా చిత్రాలు హాలీవుడ్ లో చాలానే వచ్చాయి. తెలుగులో ధృవ సినిమా చూశాం. హీరోకు విలన్ కనిపించకుండా గేమ్ ఆడుతుంటాడు. కానీ ఆ మైండ్ గేమ్ లో మజా ఉండదు. మంచి ఆర్టిస్టులన్నప్పటికీ సరైన సీన్స్ పడలేదనిపించింది.

హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ ట్రాక్స్ పెద్ద మైనస్. ఏదో సింపుల్ సీన్స్ తో లాగించేశారు. ఫస్టాఫ్ మరీ బోరింగ్ గా సాగుతుంది. మాధవన్ వచ్చేవరకు బోరింగ్ సీన్స్ తో లాగించేశారు. వెన్నెల కిషోర్, సత్య కొద్దిసేపు నవ్వించారు. షకలక శంకర్, వెన్నెల కిషోర్ కాంబినేషన్ కామెడీ కూడా బాగుంది. ఇవి తప్ప పెద్దగా మెరుపులు లేకుండా పోయాయి. ఎందుకో దర్శకుడు చందూ ఎమోషన్ సీన్స్ ని తీయడంలో విఫలమయ్యాడు. ఏ కోశాన కూడా ఫీల్ కలగలేదు. అటు ప్రేమ, ఇటు పాప కిడ్నాప్ సోసోగా అనిపిస్తుంది. ఇంట్రస్టింగ్ స్క్రీన్ ప్లే లేకపోవడంతో సింపుల్ గా వెళ్తుంది. సుభద్ర పరిణయం నాటకం చిరాకు తెప్పిస్తుంది.
సంబంధం లేని విధంగా కొన్ని సీన్స్ వస్తుంటాయి. ఎడిటింగ్ వీక్ గా అనిపిస్తుంది. కీరవాణి మ్యాజిక్ కూడా సరిగ్గా లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెషలిస్ట్ కీరవాణి కూడా కంటెంట్ వీక్ గా ఉండడంతో ఏం చేయలేకపోయారనిపించింది. మాధవన్ విలన్ గా మారడానికి సరైన కారణాలు చూపించలేదు. కారణాలు బలంగా లేకపోవడంతో ఎమోషన్ క్యారీ అవ్వలేదనిపించింది.

ఏది ఏమైనా…. చందూ మొండేటి అంచనాలకు తగ్గట్టుగా తీయలేకపోయాడు. బోరింగ్ సన్నివేశాలు, వీక్ స్క్రీన్ ప్లే, వీక్ మైండ్ గేమ్ సినిమాను సప్పగా మార్చేశాయి. కథ బాగున్నప్పటికీ డీల్ చేసిన విధానం సింపుల్ గా సాదా సీదా గా ఉంది. సవ్య చా….చి కొట్టాడనిపించింది.

Rating : 2/5