తెలుగు సినిమా స్థాయిని పెంచే “స్క్రీన్ ప్లే” ఈనెల 6 న ప్రేక్షకుల ముందుకు!!

తెలుగు సినిమా స్థాయిని పెంచే “స్క్రీన్ ప్లే”
ఈనెల 6 న ప్రేక్షకుల ముందుకు!!

బుజ్జి బుడుగు ఫిలిమ్స్ పతాకంపై డాక్టర్ అరుణకుమారి నిర్మించిన చిత్రం ‘స్క్రీన్ ప్లే’. ‘ఆఫ్ ఏన్ ఇండియన్ లవ్ స్టొరీ’ అన్నది ట్యాగ్ లైన్. పరిశ్రమవర్గాల్లో ‘స్క్రిప్ట్ డాక్టర్’గా సుప్రసిద్ధులైన కె.ఎల్.ప్రసాద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన ఒక ముఖ్య పాత్ర కూడా పోషించడం విశేషం. విక్రమ్ శివ-ప్రగతి యాదాటి హీరోహీరోయిన్లు. ఎం.వి.రఘు సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి ఎం.ఏ.శ్రీలేఖ సంగీతం సమకూర్చారు. రాజేష్ ఫణి ఎడిటర్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 6 న విడుదల కానుంది.
ఈ చిత్రాన్ని సినీ విమర్శకులకు, పలువురు రచయితలకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం.. సీనియర్ జర్నలిస్ట్ ప్రభు వ్యాఖ్యాతగా జరిగిన కార్యక్రమంలో సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ, హీరో విక్రమ్ శివ, హీరోయిన్ ప్రగతి యాదాటి, సినిమాటోగ్రఫర్ ఎం.వి.రఘు, నటుడు-నిర్మాత కె.ఎల్.ప్రసాద్, నటులు అప్పాజీ అంబరీష, ప్రముఖ న్యాయవాది-నటి జయశ్రీ రాచకొండ పాల్గొన్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సావాలకు ఎంపికైన ఈ చిత్రంలో ప్రగతి యాదాటి, విక్రమ్ శివల నటన, శ్రీలేఖ సంగీతం, ఎం వి.రఘు ఛాయాగ్రహణం, రాజేష్ ఎడిటింగ్, కె.ఎల్.ప్రసాద్ నటన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం.. ‘స్క్రీన్ ప్లే” చిత్రానికి ఆయువుపట్టుగా నిలుస్తాయని వక్తలు పేర్కొన్నారు. మానవతా విలువులున్న ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూసి తీరాలన్నారు!!