సెక్ష‌న్ 8 టీ సెంటిమెంట్‌కు వ్య‌తిరేక‌మే : కేసీఆర్ మ‌థ‌నం

ఏడాది కాలం.. అంతా స‌వ్యం.. ఇంత‌లోనే ఓటుకు నోటు కేసుతో ఓ పెను ప్ర‌మాదం తెలంగాణ వాకిట ముంచుకొచ్చింది. అస‌లు విష‌యం గాలికొదిలేసిన టీటీడీపీ నేత‌లు ఇప్ప‌డు సెక్ష‌న్ 8 పై ర‌గ‌డ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. దీనిపై గుర్రుగా కేసీఆర్ దీక్ష‌బూన‌డ‌మే కాక, టీ ఎన్జీఓల‌తోనూ మాట్లాడి నిర‌స‌న బాట ప‌ట్టేందుకు వారిని స‌మాయ‌త్తంచేస్తున్నారు. ఇప్ప‌టికే తెలంగాణ‌లో ఉద్యోగులు భోజ‌న విరామ స‌మ‌యంలో న‌ల్ల‌బ్యాడ్జీల‌తో నిర‌స‌న తెలిపేందుకు టీ ఎన్జీఓ నేత‌లు యోచిస్తున్నారు. 

మ‌రోవైపు తెలంగాణ బంద్‌కు పిలుపునివ్వాల‌ని, త‌ద్వారా స‌మ‌స్య తీవ్ర‌త కేంద్రానికి తెలియ‌జెప్పినట్లు అవుతుంద‌ని టీ ఎన్జీఓ భావిస్తోంది. కాగా త్వ‌రలో వ‌రంగ‌ల్‌, గ్రేట‌ర్ హైద్రాబాద్ ఎన్నిక‌ల దృష్ట్యానే కేసీఆర్ దీక్ష చేప‌డుతున్నార‌ని విప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. తెలంగాణ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకే ఇదంతా చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉంటే వైఎస్సార్ సీపీ మాత్రం టీడీపీ, టీఆర్ ఎస్‌తో తాము స‌మ‌దూరం పాటిస్తామ‌ని చెబుతోంది.