సీతారాముల ప్రేమకథ సాంగ్స్ రికార్డింగ్

‘జగన్ నిర్దోషి’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయిన శివ తదుపరి చిత్రం ‘సీతారాముల ప్రేమకథ’ త్వరలో ఆరంభం కానుంది. ‘వీడు మాములోడు కాదు’ ఫేం రవి.కె.శర్మ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం సాంగ్స్ రికార్డింగ్ హైదరాబాద్ లో ప్రారంభమయ్యింది. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మల్లిఖార్జునరావు మర్రాపు మాట్లాడుతూ – ”ఇది యాక్షన్ తో కూడుకున్న డిఫరెంట్ లవ్ స్టోరీ. రవి.కె.శర్మ చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చాను. ప్రస్తుతం సాంగ్స్ రికార్డింగ్ చేస్తున్నాము. మే నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ఆరంభంకానుంది” అని చెప్పారు.

డైరెక్టర్ రవి.కె.శర్మ మాట్లాడుతూ – ”శివ బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాలోని హీరో పాత్రకు యాఫ్ట్ గా ఉంటుంది. ఆయనను చాలా కొత్తగా కనిపిస్తారు. వికాస్ కురిమెళ్ల సంగీత దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం పాటలు అద్భుతంగా ఉంటాయి. ప్రస్తుతం సాంగ్స్ రికార్డింగ్ చేస్తున్నాము. మే నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ఆరంభమవుతుంది. హైదరాబాద్, వైజాగ్, గోదావరి జిల్లాల్లో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేసాం” అని తెలిపారు. 

ఈ చిత్రానికి మాటలు – సూర్య కుకునూరు, 

రచన – వింజుమూరి అచ్యుతరామయ్య, 

ఎడిటింగ్ – నందమూరి హరి, 

కథ, నిర్మాత – మల్లిఖార్జునరావు మర్రాపు, 

స్క్రీన్ ప్లే, దర్శకత్వం – రవి.కె.శర్మ