అమ్మాయిలంటే అంతే.. చాలా ‘సెల్ఫీ’ష్…

అమ్మాయిలకు అందంపై ఎంతో మోజో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాలు బయటపెట్టాలంటే పదికి ఇరవై సార్లు అద్దంలో చూసుకున్నాకే బయలుదేరతారు. ఎందుకంటే వారికి ఏదీ ఓ పట్టాన నచ్చదు.ఇటీవల ఓ సంస్థ చేసిన సర్వేలో కూడా సరిగ్గా ఇదే ప్రూవ్ అయింది…

ఇటీవల యూత్ లో సెల్ఫీలంటే మోజ పెరిగిపోయింది. సమయం, సందర్భం లేకుండా ఎవరి ఫోటోలు వారు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అదీ సరిపోకపోతే సోషల్ సైట్లలో అప్ లోడ్ చేస్తూ సరదా తీర్చుకుంటున్నారు. అయితే ఈ సెల్ఫీ అప్ లోడ్ ల విషయంలో అమ్మాయిలు మహా ముదురటండోయ్..

అమ్మాయిలు తాము తీసుకున్న ఓ సెల్ఫీని సైట్లలో అప్ లోడ్ చేయాలంటే కనీసం 10 ఫోటోలు దిగుతారట.అందులో వరుసపెట్టి ఐదు ఫొటోలు డిలీట్ చేసేసి.. ఆ తర్వాత ఆరో ఫొటోనే పోస్ట్ చేస్తారట. ఇదంతా ఊరికే చెప్తున్న లెక్కకాదండోయ్.. లండన్ కు చెందిన ఆన్ లైన్ మార్కెటింగ్ రీసెర్చి కంపెనీ వన్ పోల్ సంస్థ ఈ సర్వే చేసింది. 8 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న 2వేల మంది అమ్మాయిలు, 2 వేల మంది పురుషులు, వెయ్యిమంది పిల్లలతో ఈ పోల్ నిర్వహించింది.

అమ్మాయిల సంగతి ఓకే మరి ఈ విషయంలో అబ్బాయిల లెక్కంటని ఆలోచిస్తున్నారా..వాళ్లు కొంచెం నయంలేండి..మగాళ్లు తమ నాలుగో ఫొటోనే పోస్ట్ చేస్తున్నారట. అదీ ప్రజెంట్  గర్ల్స్ సెల్ఫీ స్ట్రాటజీ..