‘సెవెన్’ ట్రైలర్ కు అద్భుత స్పందన

అనగనగా ఓ అబ్బాయి. పేరు కార్తీక్. ప్రేమ, పెళ్లి పేరుతో పలువురు యువతులను మోసం చేశాడని అతడిపై కేసు నమోదు అవుతుంది. దాంతో పోలీసులు కార్తీక్ కోసం గాలింపు చర్యలు చేపడతారు. ‘కార్తీక్ మిస్సింగ్’ అని ఫొటోలు విడుదల చేస్తారు. అయితే… అతడు కార్తీక్ కాదని, కృష్ణమూర్తి అని ఓ వ్యక్తి చెబుతాడు. అమ్మాయిలను మోసం చేసింది ఎవరు? కార్తీక్ ఆ… కృష్ణమూర్తి ఆ? మనిషిని పోలిన మనుషులు ఉన్నట్టు… కార్తీక్ లాంటివాడు ఇంకొకడు ఉన్నాడా? ఇంకొకరు ఎవరైనా కృష్ణమూర్తిలా మారి అమ్మాయిలను మోసం చేశాడా? ఈ సస్పెన్స్ కి జూన్ 5న తెర దించుతామని రమేష్ వర్మ చెబుతున్నారు.

హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడ‌క్ష‌న్‌లో రమేష్ వర్మ నిర్మించిన డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘సెవెన్’. రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు. రహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. రమేష్ వర్మ కథ అందించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఇప్పటికే శుభం విశ్వనాధ్ సాహిత్యం అందించిన ‘సంపోద్దోయ్ నన్నే’, పులగం చిన్నారాయణ సాహిత్యం అందించిన ‘ఇదివరకెపుడు తెలియదు’ పాటలు విడుదలయ్యాయి. గురువారం సినిమా ట్రైలర్ విడుదల చేశారు. జూన్ 5న సినిమా విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా రమేష్ వర్మ మాట్లాడుతూ “ట్రైలర్, ఇప్పటివరకూ విడుదలైన పాటలకు అద్భుత స్పందన లభిస్తోంది. ప్రేక్షకుల్లో సినిమాకు వస్తున్న స్పందన చూసి బిజినెస్ బాగా జరిగింది. అభిషేక్ పిక్చర్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల హక్కులను తీసుకుంది. ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్. స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. ప్రేక్షకుల ఊహలకు అందని మలుపులతో కథనం సాగుతుంది. సినిమాలో వచ్చే ప్రతి ట్విస్ట్  ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది” అన్నారు.

హీరో హవీష్ మాట్లాడుతూ “మంచి కథతో రూపొందిన చిత్రమిది. న్యూ ఏజ్ థ్రిల్లర్ ఫిల్మ్. ఇంతమంది హీరోయిన్లతో ఇటువంటి కథతో సినిమా చేయడం కష్టం. రమేష్ వర్మగారి వల్లే ఈ సినిమా సాధ్యమైంది. ట్రైలర్, పాటలకు వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ట్రైలర్ ఎంత కొత్తగా ఉందో… సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుంది” అన్నారు.

సినిమాలో తారాగణం:
పి. శ్రీనివాసరావు, రామరాజు, ఏడిద శ్రీరామ్, విద్యులేఖ రామన్, ‘జబర్దస్త్’ వేణు, ధనరాజ్, సత్య, ‘జోష్’ రవి, సుదర్శన్, ప్రవీణ్, బాషా, సందీప్, అల్కా రాథోర్,  జె.ఎల్. శ్రీనివాస్ తదితరులు.

సినిమా సాంకేతిక వర్గం:
స్టిల్స్: శీను, పీఆర్వో: ‘బియాండ్ మీడియా’  నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి, డీఐ: లెజెండ్ స్టూడియో, కలరిస్ట్ రంగ, వి.ఎఫ్.ఎక్స్: ప్రసాద్ గ్రూప్, చీఫ్ కో-డైరెక్టర్: వేణు పిళ్ళై, కో-డైరెక్టర్: జగన్నాథ్ ఎం.ఆర్(రమేష్), ఆర్ట్ డైరెక్టర్: గాంధీ, లిరిక్స్: శ్రీమణి, పులగం చిన్నరాయణ, శుభం విశ్వనాధ్, కొరియోగ్రఫీ: సతీష్, విజయ్, డైలాగ్స్: జీఆర్ మహర్షి, స్టంట్స్:  వెంకట్ మహేష్, ఎడిటర్: ప్రవీణ్ కెఎల్, మ్యూజిక్ డైరెక్టర్: చైతన్ భరద్వాజ్, కో-ప్రొడ్యూసర్: కిరణ్ కె. తలశిల (న్యూయార్క్), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామకృష్ణ, స్టోరీ-స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్: రమేష్ వర్మ, సినిమాటోగ్రఫీ – దర్శకత్వం నిజార్ షఫీ.

=========================================================================================
‘Seven’ Trailer receives an amazing response
 
There lives a guy named Karthik.  A police case is registered against him on the charges that he has played with the lives of some girls in the name of love and marriage.  The cops start hunting for him, advertising through ‘Karthik Is Missing’ posters.  But a middle-aged man tells the cops that the accused is not Karthik but Krishnamurthy.  Who is the one who has deceived innocent girls?  Is it Karthik or Krishnamurthy?  Does Karthik have a look-alike in Krishnamurthy?  Is there more than what meets the eye?  The suspense will be unravelled on June 5, says writer-producer Ramesh Varma.
Starring Havish as the hero, ‘Seven’ is a romantic thriller directed by talented cinematographer Nizar Shafi.  Ramesh Varma is producing it on Kiran Studios.  This Telugu-Tamil film features Regina Cassandra, Nandita Sweta, Anisha Ambrose, Aditi Arya, Pujitha Ponnada and Tridha Choudhary as heroines.  Rahman and Sunkara Lakshmi will be seen in other prominent roles.
The film’s shooting formalities were completed recently.  Two singles are already out.  The first song is titled ‘Sampaddhoy Nanne’ and it’s penned by Subham Viswanadh, while the other song, titled ‘Idhivarakepudu’, is penned by Pulagam Chinnarayana.
On Thursday, a superb trailer was released.
Talking about the response to the trailer, producer Ramesh Varma says, “The trailer and the two singles have received an amazing response.  Business circles are enthusiastic about ‘Seven’.  Abhishek Pictures has acquired the rights to release the movie worldwide on June 5.  ‘Seven’ is a romantic thriller drama.  The entire screenplay is novel and is beyond the imagination of the audience.  Every twist will excite the audience.”
Hero Havish says, “The film is coming with a new story.  This is a new-age thriller.  It’s not an easy thing to make a film with this kind of story with so many actresses.  Only Ramesh Varma gar could do that.  We are very happy with the response to the trailer and the songs.  The movie will be as novel as the trailer.”
Other cast members:
P Srinivasa Rao, Rama Raju, Edida Sriram, Vidyullekha Raman, ‘Jabardasth’ Venu, Dhanraj, Sathya, ‘Josh’ Ravi, Sudarshan, Praveen, Basha, Sandeep, Alka Rathod, JL Srinivas and others.
Crew members:
Stills: Seenu, PRO: ‘Beyond Media’ (Naidu-Phani), DI: Leged Studio, Colourist: Ranga, VFX: Prasad Group, Chief Co-Ordinator: Venu Pillai, Co-Director: Jagannadh MR (Ramesh), Art Director: Gandhi, Lyrics: Srimani, Pullagam Chinnarayana, Subham Vishwanath, Choreography: Satish, Vijay, Dialogues: GR Maharshi, Stunts: Venkat Mahesh, Editor: Praveen KL, Music Director: Chaitan Bharadwaj, Co-Producer: Kiran K Talaseela (New York), Executive Producer: Ramakrishna, Story-Screenplay writer, Producer: Ramesh Varma, Cinematography-Direction: Nizar Shafi.
=======================================================================================
7 Movie Theatrical Trailer (Download Link) NO COPYRIGHT

1 – https://drive.google.com/drive/u/1/folders/1qVXI2Da18JHu2kvyr3Yq7QjGcEJNmuGt

2 – https://mab.to/iAngXKX0KUB

=======================================================================================
Here’s the Theatrical trailer of Suspense Thriller #7Movie.

#7MovieTrailer
https://youtu.be/YyEpg5Vaik0

@ajusatin  @chaitanmusic @idhavish @actorrahman @ReginaCassandra @Nanditasweta @AryaAditi @anishaambrose @iamtridha  @Cinemainmygenes @AbhishekPicture