షాదీ ముబారక్ మూవీ రివ్యూ

షాదీ ముబారక్ మూవీ రివ్యూ

బుల్లితెర స్టార్ ఆర్.కె.నాయుడు హీరోగా గతంలో సిద్దార్థ అనే సినిమా చేశారు. కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు షాదీ ముబారక్ సినిమాతో మనముందుకు వచ్చారు. ప్రతీ ఫ్యామిలీకి సాగర్ సుపరిచితమే. అందుకే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను ఎంచుకున్నారు. అందులోనూ దిల్ రాజు వంటి సీనియర్ సక్సెస్ ఫుల్ నిర్మాత నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. పద్మశ్రీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. మరి ఈ షాదీ ఎంత గ్రాండ్ గా జరిగిందో రివ్యూలో చూ్దదాం.

కథేంటంటే
ఆస్ట్రేలియాకు చెందిన ఎన్నారై సున్నిపెంట మాధవ్(సాగర్ ఆర్ కె నాయుడు). తన పెళ్లిచూపులు నిమిత్తం కేవలం ఒకే ఒక్క రోజు హైదరాబాద్ రావాల్సి వస్తుంది. పైగా ఆ ఒక్కరోజులోనే మూడు పెళ్లి చూపులు ఉంటాయి. ఇదిలా ఉండగా ఓ పెళ్లి కన్సల్టెంట్ కూతురుగా సత్యభామ(దృశ్య రఘునాథ్) కనిపిస్తుంది. మరి మూడు పెళ్లి చూపులకు వచ్చిన మాధవ్ సత్యభామను ఎలా కలుసుకుంటాడు? ఆమె కూడా ఒక పెళ్లి కూతురా వీరికి ఎలా కనెక్షన్ ఉంటుంది? చివరికి ఏం జరిగింది అన్నది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

సమీక్ష
ఇప్పటి వరకు ఆర్ కె నాయుడు స్మాల్ స్క్రీన్ పై షేడ్స్ లో కనిపించి ఆకట్టుకున్నాడు కానీ సిల్వర్ స్క్రీన్ కు వచ్చినట్టు అయితే మరింత యంగ్ గా కనిపించాడు. ఇప్పుడు ఇదే లుక్ ఈ సినిమాలో కూడా కనిపిస్తుంది. తన గత సినిమాలో కంటే కూడా ఇందులో చక్కటి లుక్స్ మరియు నటనను కనబరుస్తాడు. అలాగే కొత్త హీరోయిన్ దృశ్య రఘునాథ్ కూడా మంచి నటనను కనబరిచింది. తన డీసెంట్ లుక్స్ కూడా ఇందులో అందంగా అనిపిస్తాయి. ఇంకా ఈ ఇద్దరు మెయిన్ లీడ్ లో కెమిస్ట్రీ కూడా బాగుంటుంది. అయితే ఈ సినిమాలో ఒకింత ఇంట్రెస్టింగ్ గా అనిపించే పాయింట్ ఏదన్నా ఉంది అంటే ఈ పెళ్లి చూపులని డిజైన్ చేసిన విధానం అని చెప్పాలి. ఒకే రోజున మూడు పెళ్లి చూపులు అది కూడా ఒక కార్ లో అన్నది ఇంట్రెస్ట్ గా అనిపించే అంశం. మరి అలాగే అక్కడక్కడా వచ్చే సిట్యుయేషనల్ కామెడీ పాటలు కూడా కథానుసారం నీట్ గా ఆకట్టుకుంటాయి. ఈ సినిమాకు హీరో క్యారెక్టర్ ఎంత ముఖ్యమో… హీరోయిన్ పాత్ర సైతంఅంతే ముఖ్యం. ఇద్దరి క్యారెక్టర్స్ నిడిజైన్ చేసిన విధానం చాలా బాగుంది. పెళ్లి కాన్సెప్ట్ పై చాలా కథలు వచ్చాయి. కానీ ఈ తరహా కథ, కథనం కొత్త అనే చెప్పాలి. ఇరికించిన కామెడీ కాకుండా సందర్భానుసారంగా వచ్చే హాస్యం చాలా బాగుంది. దర్శకుడి టాలెంట్ ఇక్కడే బాగా కనిపించింది. ఫస్టాఫ్ లో వచ్చే కార్ ఎపిసోడ్ ను దర్శకుడు బాగా డీల్ చేసాడు. ఎక్కడా బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లే బాగా రన్ చేయగలిగాడు. నిర్మాత దిల్ రాజు క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. బ్యానర్ కు తగ్గట్టుగా మంచి చిత్రాన్ని అందించారు. శ్రీకాంత్ నరోజ్ సినిమాటోగ్రఫీ మంచి ఎఫెక్టీవ్ గా ఇందులో కనిపిస్తుంది. అలాగే సునీల్ కశ్యప్ ఇచ్చిన సంగీతం సినిమాకు మరో హైలైట్ గా నిలిచింది. మధు చింతల ఎడిటింగ్ బాగుంది.
కొత్త దర్శకుడు పద్మశ్రీ మళయాళ రోమ్ కామ్ ను ప్రేరణగా తీసుకొని చేసిన ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మంచి హ్యాపీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులకు అందించి ఫస్ట్ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు.

పెళ్లి కాన్సెప్ట్ లో కొత్తగా ట్రై చేసిన చిత్రం ఈ “షాదీ ముబారక్” హీరో హీరోయిన్స్ పెర్ ఫార్మెన్స్, డైరెక్షన్ చేసిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. బుల్లి తెర మీద స్టార్ గా ఎదిగిన సాగర్ ఈ సినిమాతో వెండితెర మీద కూడా మంచి స్టార్ హీరోగా ఎదిగేందుుక ఉపయోగపడే చిత్ర మిది. మంచి నటనతో మెప్పించి ఆకట్టుకున్నాడు. తన కెరీర్ ను టర్న్ చేసే చిత్రమిది. సో సరదాగా ఫ్యామిలీతో అందరూ ఎంజాయ్ చేయదగ్గ చిత్రమిది. సో గో అండ్ వాచిట్.

PB Rating : 3.25/5