శైలజా రెడ్డి అల్లుడు మూవీ రివ్యూ

మారుతి, రమ్యకృష్ణ, నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ ఈ కాంబినేషన్ వింటేనే పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అలాంటి కాంబినేషన్ లో అత్త అల్లుడు పాత్రలతో సినిమా తెరకెక్కిస్తే బజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి బజ్ మధ్యే శైలజా రెడ్డి అల్లుడు రిలీజైంది. ఈగోల నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. మరి ఈసినిమా ఎలా ఉందో చూద్దాం.

చుట్టూ ఈగో ఉండే మనషులు మనకు సహజంగానే తగులుతుంటారు. కానీ ఫ్యామిలీలోనే ఈగో లుండే మనుషులుంటే వారి పరిస్థితి ఏంటి. నాగచైతన్య పాత్ర ఇదే. తండ్రికి, ప్రేమించిన అమ్మాయికి, అత్తకు ఈగో ఉంటుంది. వారి అహం మధ్య ఎలా నలిగిపోయాడనేది మారుతి తన బ్రాండ్ మార్క్ కామెడీతో చూపించాడు. ఈ కామెడీ కోసం వెన్నెల కిషోర్, పృథ్వీని గట్టిగా వాడుకున్నాడు. మారుతి సృష్టించిన ప్రతీ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది. అందుకే ప్రతీ సీన్ కలర్ ఫుల్ గా ఫన్నీగా, ఎమోషనల్ గా సాగుతుంది.

ప్రథమార్థం అంతా లవ్ ట్రాక్స్, ప్రేమలో ఎమోషన్స్, హీరోయిన్, హీరో తండ్రి రావ్ రమేష్ ఈగోల మధ్య నడుస్తుంది. సెకండాఫ్ సినిమా కలరే మారుతుంది. ఎందుకంటే రమ్యకృష్ణ విజృంభణ చూపించాడు మారుతి. స్ట్రాంగ్ లేడీగా రమ్యకృష్ణను చూపించాడు. ఈ సినిమాకు ప్లస్ పాయింట్ దర్శకుడు మారుతి ఎంచుకున్న ఈగో ప్రాబ్లం. కథ, కథనం పర్ ఫెక్ట్ గా కుదిరాయి. పాత్రల్నితీర్చిదిద్దిన తీరు చాలా బాగుంది. నాగ చైతన్య చాలా ఎనర్జిటిక్ గా కనిపించాడు. పాత్రలో ఒదిగిపోయాడు. అను ఇమ్మాన్యుయేల్ అందం అభినయంతో ఆకట్టుకుంది. పర్ ఫెక్ట్ ఈగోయిస్ట్ గా కనిపించింది. రమ్యకృష్ణ పాత్ర సెకండాఫ్ లో పవర్ ఫుల్ గా ఉంటుంది. ఆమెని బాగా ఎలివేట్ చేశాడు మారుతి. లవ్ ట్రాక్స్ గానీ, ఎమోషన్ సీన్స్ గానీ కొత్తగా ఉంటాయి. దీంతో మనకు ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ని ఈగో సమస్య పెట్టి ఎంటర్ టైన్ చేశాడు. గోపిసుందర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. రీ రికార్డింగ్ పర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. నిజార్ షఫీ కెమెరా వర్క్ సూపర్బ్ గా ఉంది. నిర్మాణాత్మక విలువలు చాలా బాగున్నాయి.
ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీశారనిపించింది.

ఇగో కాన్సెప్ట్ చాలా రిస్క్ సబ్జెక్ట్ . కానీ మారుతి బాగా ఎంటర్ టైన్ చేయగలిగాడు. తన పెన్ పవర్ తో సన్నివేశాల్ని కామెడీగా మలిచాడు. ఎమోషనల్ సీన్స్ కూడా బాగా రాశారు. అందరు ఊహించిన కథ మాత్రం కానే కాదు. ఈగోల చుట్టూ అల్లుకున్న కథ అని ఎవ్వరూహించరు. అసలుతల్లి కూతురు మాట్లాడుకోకపోవడం మెయిన్ ట్విస్ట్. తల్లిని కూతురిని కలిపే అల్లుడిగా చైతు నటించాడు. ఈ తరహా కథ, కథనం మనకు కొత్తగా ఉంటుంది. తన ప్రేమను దక్కించుకుంటూనే అందరి ఈగోల్ని సెట్ చేసే క్యారెక్టర్ బాగుంటుంది. అందరికీ సినిమా ప్రారంభంలోనే చైతు పాత్ర కనెక్ట్ అవుతుంది. దీంతో కథతోపాటు ట్రావెల్ అవుతుంటాం. ద్వితీయార్థంలో వెన్నెల కిషోర్‌, పృథ్వీ ఎపిసోడ్ కి పొట్టచెక్కలయ్యేలా నవ్వుతాం.

ఓవరాల్ గా…. పేరుకు తగ్గట్టే… పవర్ ఫుల్ స్టోరీని, ఎంటర్ టైన్ మెంట్ వేలో చెప్పాడు మారుతి. ఈగో లు అందరికీ ఉంటాయి. ఎవరికి ఏ స్థాయిలో ఉంటే మంచిదనే విషయాన్ని కామెడీగా ఎమోషనల్ గా చెప్పాడు. సో ఫ్యామిలీ ఆడియెన్స్ చక్కగా ఎంజాయ్ చేయదగ్గ సినిమా. సో… వినాయకచవితి సందర్భంగా రిలీజైన ఈ సినిమాతో ఎంజాయ్ చేయ్యెచ్చు. సో గో అండ్ ఎంజాయ్… యువర్ ఈగో…

Rating : 3.25/5