శైలజా రెడ్డి దూకుడు… భారీ ఓపెనింగ్స్ తో అల్లుడికి స్వాగతం

మారుతి దర్శకత్వంలో నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా… రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించిన శైలజా రెడ్డి అల్లుడు గ్రాండ్ రిలీజైంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి ప్రతి చోటి నుంచి మంచి పాజిటివ్ బజ్ వచ్చింది. విడుదలైన అన్ని థేయేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావడం… వినాయక చవితి పర్వదినం కావడంతో అన్ని థియేటర్లు ఫుల్స్ తో భారీ ఓపెనింగ్స్ సాధించింది. ముఖ్యంగా రమ్యకృష్ణ పెర్ ఫార్మెన్స్, వెన్నెల కిషోర్, పృథ్వీ కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. ఈగో చుట్టూ అల్లుకున్న కథ కావడంతో అందరూ కనెక్ట్ అవుతున్నారు.

నిర్మాతలు ఆశించిన దానికంటే భారీ ఓపెనింగ్ సాధించింది. రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ రావడంతో చిత్ర నిర్మాతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఓవర్సీస్ ప్రేక్షకులు సైతం శైలజా రెడ్డికి భారీగా స్వాగతం పలికారు. ప్రీమియర్స్ నుంచే 100కె డాలర్స్ వసూలు చేయడం విశేషం. మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసే కంటెంట్ కావడంతో… ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సో… శుక్ర, శని, ఆది వారాలు కూడా హౌస్ ఫుల్ బోర్డులు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.