సెన్సార్ పూర్త‌యింది.. సినిమా రావ‌ట్లేదు..

ఈ రోజు రేపు సినిమాలు సెన్సార్ ఇలా పూర్తి చేసుకున్నాయో లేదో ఎప్పుడెప్పుడూ రిలీజ్ చేద్దామా అన్న‌ట్లున్నారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. కానీ క‌ళ్యాణ్ రామ్ షేర్ ప‌రిస్థితి వేరు. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. యు/ఎ స‌ర్టిఫికేట్ వ‌చ్చింది. అయితే సినిమాను మాత్రం ఇప్పుడు విడుద‌ల చేయ‌డం లేదు. అక్టోబ‌ర్ 22న కంచెకు పోటీగా షేర్ ను తీసుకురావాల‌ని భావించారు ద‌ర్శ‌కనిర్మాత‌లు. కానీ త‌ర్వాత మ‌న‌సు మార్చుకుని అక్టోబ‌ర్ 30న షేర్ ను థియేట‌ర్స్ లోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.
 
షేర్ ను మ‌ల్లిఖార్జున్ తెర‌కెక్కించాడు. గ‌తంలో క‌ళ్యాణ్ రామ్ తో అభిమ‌న్యు, క‌త్తి సినిమాలు చేసిన మ‌ల్లిఖార్జున్.. ఇప్పుడు షేర్ తో మూడోసారి జోడీక‌ట్టాడు. గ‌త రెండు సినిమాల‌తో నిరాశ ప‌రిచిన ఈ జంట‌.. షేర్ తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రోర్ చేయాల‌ని చూస్తున్నారు. లెజెండ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ ఇందులో క‌ళ్యాణ్ రామ్ తో ఆడిపాడింది. థ‌మ‌న్ సంగీతం సినిమాకు స్పెష‌ల్ అట్రాక్ష‌న్.