సచిన్, ద్రవిడ్, గంగూలీ సరసన శిఖర్ ధావన్…న్యూ రికార్డు

భారత క్రికెట్ జట్టు సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై ఓడిపోవడంతో ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. అయితే ఓపెనర్ శిఖర్ ధావన్ కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌లో 45 పరుగులు చేసి మంచి ఆరంభం ఇచ్చాడు. ధావన్ ఈ టోర్నీలో ఆద్యంతం బాగా ఆడి మొత్తం 449 పరుగులు చేసి న్యూ రికార్డు సృష్టించాడు.

టోర్నీలో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన ధావన్ 2 సెంచరీలతో 449 పరుగులు చేశాడు. గతంలో ఒకే ప్రపంచకప్‌లో 400 పరుగులు చేసిన భారత క్రికెటర్లలో 1999 ప్రపంచకప్‌లో గంగూలీ, ద్రవిడ్ ఈ ఫీట్ సాధించారు.

ఇక సచిన్ 1996,2003,2011 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో సచిన్ ఏకంగా మూడుసార్లు ఈ ఫీట్ సాధించాడు. ఇప్పుడు తాజాగా శిఖర్‌ధావన్ ఈ ఫీట్‌ను సాధించారు. అయితే భారత్ సెమీఫైనల్లో ఓడిపోవడం దురదృష్టకరం.