సిల్లీ ఫెలోస్ మూవీ రివ్యూ

డైరెక్టర్ భీమనేని సినిమాలంటేనే రీమేక్ లు ఉంటాయి. రీమేక్ స్పెషలిస్ట్ గా ఆయనకు మంచి పేరుంది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిల్లీ ఫెలోస్ కూడా రీమేక్ సినిమానే తమిళంలో వచ్చిన ‘వెలైను వాన్ దుట్ట వెల్లైకారన్’ (Velainu Vandhutta Vellaikaaran) చిత్రాన్ని తెలుగులో సునీల్, అల్లరి నరేష్ హీరోలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ ఇద్దరు కామెడీ హీరోలకు ఎలాంటి విజయం అందిందో చూద్దాం.

కథేంటంటే…

ఓ మంత్రి చనిపోతూ అయిదు వందల కోట్ల రహస్యం ఎమ్మెల్యే జాకెట్ (జయప్రకాష్ రెడ్డి) కి చెప్పిపోతాడు. కానీ ఆ కొద్ది సేపటికే ప్రమాదం జరిగి ఎమ్మెల్యే కోమాలోకి వెళ్లిపోతాడు. కోమాలోంచి బయటకు వచ్చినా, మెమరీ లాస్ తో పదేళ్ల పిల్లాడైపోతాడు. ఇదే ఎమ్మెల్యే సామూహిక వివాహాలు చేసినపుడు, నెంబర్ కోసం వీరబాబు (సునీల్)కు ఓ వేశ్యతో ఉత్తుత్తి పెళ్లి చేయించేస్తాడు. అది వీరబాబు కొంపమీదకు వస్తుంది. ఎక్కడికి వెళ్లినా, పుష్ప మొగుడు అని పలకరింపు ఎదురవుతుంటుంది. ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ గా వుండే హీరో (అల్లరి నరేష్) తను ప్రేమించిన అమ్మాయికి పోలీస్ ఉద్యోగం కోసం పదిలక్షలు తీసుకువచ్చి ఎమ్మెల్యే జాకెట్ కు ఇస్తాడు. కానీ అతగాడు కోమాలోకి పోవడంతో, ఆ ప్రియురాలు ఇతగాడిని పట్టుకుని సతాయిస్తూ వుంటుంది. ఇంతకూ వందల కోట్లు ఏమయ్యాయనేది అసలు కథ…

సమీక్ష
తమిళ చిత్రాన్ని చెడగొట్టకుండా ఎలా ఉందో అలాగే అల్లరి నరేష్, సునీల్ మీద చిత్రీకరించారు. ఇద్దరూ కామెడీ ఇరగదీస్తారు కాబట్టి… ప్రేక్షకులు బాగా ఎంటర్ టైన్ అవుతారు. ఇద్దరి క్యారెక్టర్స్ ఫుల్ ఫన్ తో రన్ అవుతాయి. పాటలు అడ్డంకిగా మారే సమస్య లేదు కాబట్టి….కామెడీని బాగా ఎంజాయ్ చేయ్యెచ్చు. అలాగే….. రన్ టైం కూడా పెద్దగా ఉండదు సో… బోర్ గా ఫీలయ్యే ఆస్కారమే లేదు. మెయిన్ ఎస్సెట్ కామెడీనే కాబట్టి… కామెడీ పంచులతో సాగుతుంది. క్లైమాక్స్ పార్ట్ లో… జయప్రకాష్ రెడ్డి, పోసాని, రఘు తదితరులు కామెడీ పండించేందుకు ప్రయత్నించి సఫలమయ్యారు. మాస్, క్లాస్ ఆడియెన్స్ అనే తేడా లేకుండా ఎంజాయ్ చేయ్యెచ్చు. అల్లరి నరేష్ కంటే కూడా సునీల్ కామెడీ బాగా పండింది. దర్శకుడు కూడా సునీల్ చే కామెడీ బాగా చేయించాడు. సునీల్ సైతం పాత్రలోకి ఒదిగిపోయి కామెడీ పండించాడు. భీమనేని పాత తరం దర్శకుడైనా అప్ డేట్ అయ్యారనిపించింది. కామెడీలో కొత్తదనం చూపించే ప్రయత్నం చేశారు. తమిళంలోని కామెడీనే అయినా…తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా డైలాగ్స్ రాసుకున్నారు. పుష్ప ట్రాక్ అదిరిపోతుంది. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడక్కడ బ్రహ్మానందం మెరుపులు ఎలాగూ ఉన్నాయి. హీరోయిన్స్ ఇద్దరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చే సినిమా ఇది. ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాలు ఈ మధ్య కాలంలో బాగా తగ్గాయి. అలాంటి టైంలో వచ్చిన సిల్లీ ఫెలోస్ ఫ్యామిలీ ఆడియెన్స్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తుంది. మాస్, క్లాస్ ఆడియెన్స్ ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ ఉన్నాయి… కాబట్టి సిల్లీ ఫెలోస్ ఈజీగా మంచి కలెక్షన్స్ రాబడుతుంది. పక్కా టైంపాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ఫిల్మ్ ఇది. పైసా వసూల్ సినిమా కాబట్టి అల్లరి నరేష్, సునీల్ కెరీర్ కు బాగా హెల్పవుతుంది.

టెక్నికల్ గా కూడా ఈ సినిమా చాలా క్వాలిటీగా ఉంది. నిర్మాతలు బాగా ఖర్చు పెట్టారనిపించింది. మ్యూజిక్, సినిమాటోగ్రఫి బాగుంది. డైలాగ్స్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. అల్లరి నరేష్, సునీల్ కామెడీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అదే తరహాలో భీమనేని స్టైల్లో నవ్వించే కామెడీ చిత్రమిది. గో అండ్ ఎంజాయ్.

PB Rating : 3/5