ప్రముఖ గాయకుడు…నటుడు సాయి కిరణ్ తండ్రి రామకృష్ణ కన్నుమూత…

ప్రముఖ గాయకుడు రామకృష్ణ కన్నుమూశారు. విస్సంరాజు రామకృష్ణ ఆయన పూర్తి పేరు. జూబ్లిహిల్స్ లోని వెంకటగిరిలోని ఆయన నివాసంలో మృతి చెందారు. 1947 ఆగస్ట్ 20న విజయనగరంలో ఆయన జన్మించారు. నువ్వేకావాలి ఫేం సాయి కిరణ్ రామకృష్ణ తనయుడే. ప్రముఖ గాయని సుశీల రామకృష్ణకు పినతల్లి.

కృష్ణంరాజు, ఏఎన్నార్, శోభన్ బాబు, ఎన్టీయార్ చిత్రాల్లో ఆయన పాటలు పాడారు. గుణవంతుడు, బలిపీఠం, అల్లూరి సీతారామరాజు, తాతా మనవడు, భక్త తుకారం, కరుణామయుడు, భక్త కన్నప్ప, అందాల రాముడు వంటి పలు చిత్రాల్లో సూపర్ హిట్ పాటలు పాడారు రామకృష్ణ. దాదాపు 200 చిత్రాల్లో 5 వేలకు పైగా పాటలు పాడారు. ఆయన పాడిన భక్తి గీతాలకు మంచి ఆదరణ లభించింది.

రామకృష్ణ మరణం తీరని లోటని పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.